మెటా కంపెనీకి చెందిన పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇకపై ఈ ఫోన్లల్లో పని చేయదు. ఇకపై iOS-10, iOS-11, iPhone 5, iPhone 5C ఫోన్లలో ఈ ఏడాది అక్టోబర్ 24వ తేదీ నుంచి వాట్సాప్ పనిచేయదని సంస్థ వెల్లడించింది. యాప్ ఫీచర్లను పూర్తిగా ఆస్వాదించడానికి ఐఓఎస్-12 ఫోన్.. అంతకంటే పైన మోడల్స్ కు మాత్రమే వీలుంది. కొత్త మార్పులను అప్‌గ్రేడ్ చేయడానికి, భద్రతను మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.
ఈ అప్‌డేట్ కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఫోన్ వినియోగదారులకు చేదువార్త మిగిలింది. వినియోగదారులకు వాట్సాప్ ఫీచర్లు అందుబాటులో ఉండదు. ఇప్పటికీ పాత ఐఓఎస్ వెర్షన్ వాడుతున్న వారికి మాత్రమే వాట్సాప్ అందుబాటులో ఉంటుందన్నారు. ఐఓఎస్-10, ఐఓఎస్-11లో పనిచేసే యాప్స్.. ఆ తర్వాత అన్ని ఫీచర్లతో సరిగ్గా పనిచేయవన్నారు. ఈ అప్‌డేట్ కారణంగా ఐఓఎస్-10, ఐఓఎస్-11 వెర్షన్లు వాడుతున్న వినియోగదారులు యాప్ స్టోర్ నుంచి వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసుకోలేరని సంస్థ వెల్లడించింది.