కరోనా నేపధ్యంలో వాట్సాప్ సరికొత్త ఫీచర్…!

-

ప్రముఖ సోషల్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ ఎప్పటికప్పుడు తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్స్ ని యాడ్ చేస్తూ వస్తుంది. వినియోగదారుల భద్రత మాత్రమే కాకుండా వారికి కొత్త అనుభూతిని అందించడానికి ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా వాట్సాప్ మరో నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ లో నలుగురు పైగా వీడియో కాల్ లో చేర్చడానికి తమ యాప్ ని అభివృద్ధి చేస్తున్నట్టు తెలుస్తుంది.

వీడియో కాలింగ్ యాప్స్ కి ఆదరణ పెరుగుతూ వస్తుంది. దీనితో వారిని దెబ్బ కొట్టడానికి గానూ వాట్సాప్ ప్రయత్నాలు చేస్తుంది. ఒకేసారి నలుగురు వ్యక్తులను కాల్ లోకి అనుమతిస్తే వినియోగదారులు తమ యాప్ లో ఉంచాలని భావిస్తుంది. WABetainfo నివేదిక ప్రకారం చూస్తే వాట్సాప్ చి ఫీచర్ ఇంకా అభివృద్ధిలో ఉన్నందున కొత్త గ్రూప్ కాల్ పరిమితి గుర్తించి ఇంకా స్పష్టమైన సమాచారం లేదని పేర్కొంది.

అయితే ఇక్కడ భద్రతను ప్రామాణికంగా తీసుకుంటుంది యాప్. గ్రూప్ కాల్ ఫీచర్‌ను అధికారికంగా విడుదల చేయడానికి ముందు ఇది బగ్ రహితంగా ఉండేలా చూడాలనుకుంటుంది. IOS 2.20.50.23 కోసం వాట్సాప్ మెసెంజర్ బీటాలోఈ ఫీచర్ ని జోడించాలని భావిస్తుంది. ఇందుకోసం యాప్ లో మరిన్ని ఫీచర్స్ ని యాడ్ చెయ్యాలి అని చూస్తుంది. లాక్ డౌన్ కారణంగా కారణంగా ప్రపంచం మొత్తం లాక్డౌన్లో ఉన్నందున, వీడియో-కాలింగ్ యాప్స్ కి డిమాండ్ పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news