పవన్ సినిమాలో హీరోయిన్ గా ఎవరంటే…

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… సినిమాలో చేయడానికి ఎందరో హీరోయిన్ లు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆయన తో సినిమా చేయడానికి హీరోయిన్ లు ముందుకి రావడం లేదు. అసలు కారణం ఏంటీ అనేది ఒకసారి చూస్తే… ఆయన ప్రస్తుతం హీరోగా చేస్తున్న వకీల్ సాబ్ సినిమాలో హీరోయిన్ కోసం బాగా వెతుకుతున్నారు. హీరోయిన్ ని ఎంపిక చేయడానికి దర్శకుడు ఎక్కువగా కష్టపడుతున్నారు.

నిర్మాతలు కూడా ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ కోసం భారీ ప్రయత్నాలే చేస్తున్నారు. ఎందరో హీరోయిన్ లను అడిగినా సరే ఎవరూ కూడా ముందుకి రావడం లేదు. దీనికి కారణం ఏంటీ అనేది చూస్తే వకీల్ సాబ్ లో అసలు హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉండదు అనే భయం హీరోయిన్లలో ఉంది. ఆ సినిమాలో హీరోయిన్ పాత్రకు పది నిమిషాలు కూడా పాత్ర ఉందని సమాచారం.

రెండు పాటల్లో మాత్రమే హీరోయిన్ కనపడే అవకాశం ఉందని అంటున్నారు. శృతి హాసన్, అనుష్క సహా పలువురి పేర్లను పరిశీలించారు. ఇప్పుడు ఆ పాత్రకు గాను తెలుగులో ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఇలియానా ను ఎంపిక చేసినట్టు సమాచారం. ఆమె తెలుగులో కనపడితే చాలు అనుకునే పరిస్థితి. ఆమెకు ఫాలోయింగ్ కూడా ఉంది. దీనితో ఆమెను ఎంపిక చెయ్యాలి అని దర్శకుడు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news