వాట్సాప్ యూజర్లు ఏ ఫీచర్ కోసం ఎక్కువ ఎదురు చూస్తున్నారో తెలుసా…?

-

వాట్సాప్” ఒంటి మీద బట్టలు లేని వాళ్ళు అయినా కనపడుతున్నారు గాని చేతిలో ఫోన్, ఆ ఫోన్ లో వాట్సాప్ లేని వాడు మాత్రం కనపడటం లేదు. ఒక్క మన దేశంలోనే వాట్సాప్ దాదాపు 40 నుంచి 50 కోట్ల మంది వరకు వాడుతున్నార౦టే దాని వాడకం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. నిత్యావసర వస్తువుగా మారిపోయింది ఈ సోషల్ మీడియా మెసెంజర్ యాప్. వ్యాపార౦ నుంచి బెడ్ రూమ్ వరకు,

ఆఫీస్ నుంచి వంట గది వరకు, యునివర్సిటి నుంచి స్కూల్ వరకు ప్రతీ ఒక్క దగ్గర మనం వాట్సాప్ వాడుతూనే ఉన్నా౦. దీనితో సంస్థ కూడా ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ ఆకట్టుకుంటుంది. అయితే వినియోగదారులు ఎక్కువగా ఎదురు చూసే ఫీచర్ మాత్రం వాట్సాప్ ఇవ్వలేకపోతుందట. గత ఏడాది నుంచి ఆ ఫీచర్ కోసం ఎక్కువగా,

ఆ సంస్థ వినియోగదారులు ఎక్కువగా ఎదురు చూస్తున్నట్టు వాట్సాప్ తెలిపింది. అదేంటో తెలుసా…? డార్క్ మోడ్. వాట్సాప్ వాడకం ఎక్కువగా రాత్రి సమయాల్లోనే ఉండటంతో ఫోన్ కాంతితో కళ్ళ సమస్యలు వస్తున్నాయి. దీనితో డార్క్ మోడ్ వస్తే బ్యాక్ గ్రౌండ్ గ్రే కలర్ అంటే బూడిద రంగులో, టెక్స్ట్ తెలుపు రంగులో ఉంటుంది. అందుకే వినియోగదారులు ఎక్కువగా ఆ ఫీచర్ కోసం ఎదురు చూస్తున్నారు. అది వస్తే కళ్ళకు ఇబ్బంది ఉండదు. ఇప్పటికే నిద్రలు మానుకుని మరీ వాడుతున్న జనం అది వస్తే పగలు పడుకుని రాత్రి ఫోన్ నొక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది ఆ ఫీచర్ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news