క్రెడిట్ కార్డు ని ఎప్పుడు క్యాన్సిల్ చేయాలో తెలుసా..?

-

చాలా మంది పేమెంట్స్ ని చేసేందుకు క్రెడిట్ కార్డ్స్ ని వాడుతున్నారు. ఎక్కువగా కరోనా సంక్షోభం తర్వాత క్రెడిట్ కార్డులని వాడడం జరుగుతోంది. మంచి క్రెడిట్ స్కోరు వున్న వారికి బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు క్రెడిట్ కార్డ్స్ ని ఆఫర్ చేస్తున్నారు. అయితే ఈ కార్డ్స్ ని కూడా జాగ్రత్తగా ఉపయోగించాలి లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

సరైన టైం కి ఈఎంఐ కట్టడం వంటివి జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నా సమస్యే అని మాత్రం మరచిపోవద్దు. ఎక్కువ కార్డులు కాకుండా తక్కువ కార్డులు ఉండి గరిష్ట పరిమితి ఉండేలా చూడండి. అలానే లిమిట్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఖర్చు చేసేడం కాదు. తక్కువ లిమిట్ అయితే రుణ వినియోగ నిష్పత్తి పెరుగుతుంది. క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది. అలాంటప్పుడు మీ వద్ద రెండు కంటే ఎక్కువ కార్డ్స్ ఉంటే తక్కువ పరిమితి ఉన్న కార్డును రద్దు చేసుకోవడం మంచిది. ఇక కార్డు ని ఎప్పుడు క్యాన్సల్ చెయ్యాలి…? ఎలా చెయ్యాలి అనేది చూద్దాం.

కార్డుని క్యాన్సల్ చేయడం గురించి చూస్తే.. ఎప్పుడైనా సరే కార్డును వీలైనంత ఎక్కువ కాలం వాడితేనే బెస్ట్. ఎక్కువ రోజులు వాడారు కనుక మీ క్రెడిట్ స్కోరు దానిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అది క్యాన్సల్ చేస్తే స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది. కొత్త కార్డులు ఉంటే రద్దు చేసుకోవడం ఉత్తమం. అలానే కార్డుని రద్దు చేసే ముందు రివార్డ్ పాయింట్లు వాడండి. క్రెడిట్ కార్డుపై చెల్లించాల్సిన మొత్తం తిరిగి కట్టేయండి. బ్యాంకును సంప్రదించి క్రెడిట్ కార్డు ని మీరు రద్దు చేసేయచ్చు. లేదంటే కొన్ని సైట్స్ ద్వారా కూడా రద్దు చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news