యాంకర్ సుమ సినిమా ఎప్పుడంటే…?

-

 

ప్ర‌ముఖ యాంక‌ర్  సుమ కనకాల న‌టించిన తాజా చిత్రం `జయమ్మ పంచాయితీ`  ఏప్రిల్ 22న విడుద‌ల కానుంది అని చిత్ర నిర్మాణ వ‌ర్గాలు ప్రకటించాయి.విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.గ్రామీణ నేప‌థ్యంలో సాగే ఈ క‌థ‌లో ఎవరికీ, దేనికీ లొంగని నిస్వార్థపూరిత మహిళగా సుమ నటించారు.ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, అనూష్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా ప‌నిచేశారు.శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన ధ‌ను అండ్లూరి (విఖ్యాత చిత్ర‌కారులు) ఆర్ట్ డైరెక్ష‌న్ చేశారు.

సోర్స్ : – సినీ వినోదం ఫేం రాంబాబు

Read more RELATED
Recommended to you

Latest news