అడవిదొంగ సినిమా చూపిస్తూ.. అనస్తీషియాతో పనిలేకుండా ఆపరేషన్‌ చేసిన వైద్యులు

-

సాధారణ ఆపరేషన్లకే మత్తుమందు ఇచ్చి చేస్తారు. అలాంటిది అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను రోగికి మత్తు ఇవ్వకుండానే విజయవంతంగా చేశారు సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి వైద్యులు. డాక్టర్లు సర్జరీ మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తి చేసే వరకు రోగికి ఇష్టమైన సినిమా చూపించి తమ పని పూర్తి చేయడం ఇప్పుడు సంచలనం రేపుతుంది. అసలేం జరిగిందంటే…

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతూ గాంధీ హాస్పిటల్‌లో చేరింది. డాక్టర్లు అన్నీ టెస్ట్‌లు చేశారు. ఎక్సేరేలు తీయడంతో మెదడులో కణితి ఉన్నట్లుగా గుర్తించారు. అయితే సాధారణంగా ఆపరేషన్ చేస్తే ఆమె ప్రాణాలకు ప్రమాదకరం కాబట్టి ‘అవేక్ క్రానియోటమీ’ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. మెదడు దెబ్బతినకుండా ఉండటానికి రోగికి మత్తు ఇంజక్షన్ ఇవ్వకుండా స్పృహలో ఉంచి చేసే సర్జరీ. సుమారు రెండు గంటల సమయం పట్టే ఈ సర్జరీ చేయడానికి గాంధీ డాక్టర్లు పేషెంట్‌కి మత్తివ్వకుండా సర్జరీ చేసేందుకు ఆమెకు ఇష్టమైన సినిమా ఏదో తెలుసుకున్నారు.

ఆపరేషన్‌ థియేటర్‌లో తీసుకురాగానే స్మార్ట్ ఫోన్ ఆమె చేతికిచ్చి అడవిదొంగ సినిమా చూపిస్తూ సర్జరీని విజయవంతంగా ముగించారు. ఆపరేషన్ చేస్తున్న రెండు గంటల సమయంలో డాక్టర్లు సర్జరీపై దృష్టి పెడితే మిగిలిన సిబ్బంది ఆమెను పలకరిస్తూ సినిమాలోని స్టోరీ అడుగుతూ కాలక్షేపం చేశారు. రెండు గంటల్లో మెదడులోని కణితులను తొలగించారు. రోగికి మెదడు ఆపరేషన్ జరుగుతుందనే ఆలోచనే రాకుండా మెదడులోని కణతులను తొలగించినట్టుగా గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.

ఈ రోజుల్లో… చిన్నపిల్లలకు ఫోన్‌ ఇస్తే చాలు.. కిక్కురుమనకుండా.. ఫోన్‌ చూసుకుంటూ ఉంటారు. ఆ టైంలో మనం ఏ పెట్టినా మారం చేయకుండా తింటారు. ఈ పద్ధతి నచ్చి.. పెద్దోళ్లు కూడా వారి వెనక పరిగెత్తి నానా తంటాలు పడి తినిపెట్టే బదులు ఒక ఫోన్‌ చేతిలో పడేసి ఫుడ్‌ పెట్టేస్తున్నారు. అదే ప్రాక్టీస్‌ ఇక్కడ మన గాంధీ హాస్పటల్‌ వైద్యులు కూడా చేయడం విశేషం.!

Read more RELATED
Recommended to you

Latest news