ప్రముఖ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లైగర్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా , అనన్య పాండే హీరోయిన్గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి కలెక్షన్ లను రాబడుతుందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి నిర్మాతలుగా పూరీ జగన్నాథ్ , ఛార్మీ కౌర్ తో పాటు బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ కూడా భాగస్వామ్యం అయ్యారు. ఇకపోతే ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ సినిమాలో హీరో క్యారెక్టర్ కి సంబంధించి ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ అవ్వడమే కాదు మాటలో నత్తి కలిగి ఉండడం కూడా హీరోకి మైనస్ అని అంటున్నారు.
ఇక పూరీ జగన్నాథ్ సినిమాలంటే హీరోలంతా గలగల మాట్లాడుతూ.. ఉరమాస్ డైలాగ్స్ తో థియేటర్స్ లో విజిల్స్ వేయిస్తూ ఉంటారు. కానీ లైగర్ విషయానికి వచ్చేసరికి హీరోకి మాటలో నత్తి ఉండడం, మాటిమాటికి నత్తితో ఇబ్బంది పడడం, దీంతో సినిమాలో హీరో క్యారెక్టర్ నుండి ఎలాంటి మాస్ డైలాగ్స్ కి స్కోప్ లేకుండా పోవడం అనేవి పూరీ పై కామెంట్స్ కి దారితీసాయి. ఇకపోతే ఈ క్రమంలోనే నత్తి కావాలని పెట్టారా ఒకవేళ బ్రీడ్ లో ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమైనా నిజంగానే ఉంటాయా? అనే దిశగా నేటిజన్స్ కూడా ఆరా తీస్తున్నారు. ఇక నిజానికి క్రాస్ బ్రీడ్ జీవుల్లో సాధారణంగా వైకల్యాలు, రెటీనా క్షీణత, అసాధారణ కపాల నిర్మాణం, మానసిక బలహీనత, కార్డియాక్ లోపాలు, మూత్రపిండాల సమస్యలు, పార్కిన్సన్స్ వ్యాధి, పార్శ్వ గూని , వెన్నెముక సమస్యలతో పాటు మాటతీరు కూడా నత్తిగా రావడం అనేది సహజమట.
మరి లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కి నత్తి పెట్టడం వెనుక పూరీ జగన్నాథ్ చాలా రీసెర్చ్ చేశాడని.. అలా ఊరికే నెత్తిపెట్టడం కాకుండా సైంటిఫిక్ కారణాలను పరిగణలోకి తీసుకొని.. ఇలా పెట్టి ఉంటాడని అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. ఇకపోతే ఈ విషయం తెలుసుకున్న నేటిజన్స్ కూడా నువ్వు మామూలోడు కాదు పూరీ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.