ఏపీ నూతన చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాథ్ దాస్ ని సిఎం జగన్ నియమించారు. ఈనెల 31వ తేదీతో ప్రస్తుతం సిఎస్ గా నీలం సహాని పదవీ కాలం ముగుస్తుంది. అదే రోజున ఆదిత్యనాథ్ దాస్ సీఎస్ గా ప్రమాణ స్వీకారం చేస్తారని ఏపీ సర్కార్ ప్రకటన చేసింది. తెలంగాణ నుంచి వచ్చిన శ్రీలక్ష్మికి ఏపీ సర్కార్ మున్సిపల్ శాఖ సెక్రటరీగా బాధ్యతలు ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
ఏపీ సాంఘీక సంక్షేమ శాఖ కార్యదర్శిగా కె. సునీతను జగన్ నియమించారు. సీఎస్‌గా పదవీ విరమణ పొందనున్న నీలం సాహ్నీని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నీలం సహానీ విషయంలో సిఎం జగన్ ముందు నుంచి సానుకూలంగా ఉన్నారు. అందుకే ఆమెను రెండు సార్లు సిఎస్ గా జగన్ నియమించారు. జగన్ ప్రతీ నిర్ణయంలో కూడా తన వంతుగా ఆమె బాధ్యతలు నిర్వహించారు.
ఇక ఏపీ ప్రభుత్వం ఇప్పుడు కష్టాల్లో ఉన్న నేపధ్యంలో సిఎం జగన్ కొన్ని కొన్ని కీలక అడుగులు వేస్తున్నారు. అందుకే కీలక అధికారుల మద్దతు అనేది అవసరం. సమర్ధవంతమైన అధికారుల అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అందుకే నీలం సహానీని మళ్ళీ మరో పదవి ఇచ్చి జగన్ కొనసాగించారు.