ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ మధ్య అవగాహన కుదిరినట్టు తెలిసింది. ఐదేళ్ల పాటు సీఎం పదవిని శివసేనకుఇచ్చేందుకు కాంగ్రెస్-ఎన్సీపీ భాగస్వామ్య పక్షం అంగీకరించినట్లు సమాచారం. ఇందుకు ప్రతిగా కాంగ్రెస్-ఎన్సీపీకి డిప్యూటీ సీఎం పదవులు దక్కనున్నట్లు తెలిసింది. అంతేకాదు, ఎన్సీపీకి మండలి ఛైర్మన్, ఒక డిప్యూటీ సీఎం, 14 మంత్రి పదవులు ఇక కాంగ్రెస్‌కు స్పీకర్, ఒక డిప్యూటీ సీఎం, 12 మంత్రి పదవులు ఇచ్చేందుకు ఉమ్మడి ప్రణాళికను ఖరారు చేశాయి మూడు పార్టీలు.
ఉమ్మడి ప్రణాళికను మూడు పార్టీలు ఆమోదించడంతో త్వరలో మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఆదివారం సోనియాగాంధీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమలవుతున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 24న ఫలితాలు వెల్లడైన నాటి నుంచి నేటి వరకూ మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి త్వరలోనే శుభం కార్డు పడే అవకాశం కనిపిస్తోంది.