జబర్దస్త్ లోకి కొత్త కమెడియన్.. ఎవరంటే..?

-

బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు కామెడీ షో లలో జబర్దస్త్ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. గత 13 సంవత్సరాలుగా ప్రేక్షకులకు నిర్విరామంగా ఎంటర్టైన్మెంట్ అందిస్తోందని చెప్పవచ్చు. ఇకపోతే కొద్ది రోజుల నుంచి జబర్దస్త్ నుంచి ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు మరి కొంతమందిని కమెడియన్స్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది జబర్దస్త్. ఈ క్రమంలోనే కామెడీ స్టార్స్ ద్వారా బాగా పాపులారిటీని దక్కించుకున్న సద్దాం ను జబర్దస్త్ లోకి తీసుకొస్తున్నట్లు సమాచారం.

పటాస్ ద్వారా తన పంచులతో ప్రేక్షకులను అలరించిన సద్దాం అతి తక్కువ కాలంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు . ఆ తర్వాత కామెడీ స్టార్స్ షోలో అదిరిపోయే పంచులతో మరింత రెచ్చిపోయిన సద్దాం తన తోటి కమెడియన్ రియాజ్ తో కలిసి గల్లీ బాయ్స్ టీం తో ఈయన చేసిన రచ్చ మామూలుగా లేదు. అలా ప్రేక్షకులకు విపరీతంగా దగ్గరయ్యాడు సద్దాం. ఇక ఫలానా ఎపిసోడ్ మళ్లీ వేయండి ప్లీజ్ అనేంతగా సద్దాం తనదైన పంచులతో ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాడు.

ప్రస్తుతం కామెడీ ధమాకా , కామెడీ స్టార్స్ షో తో రచ్చలేపుతున్న సద్దాం త్వరలోనే జబర్దస్త్ లోకి రానున్నట్లు సమాచారం. నిజానికి జబర్దస్త్ హైపర్ ఆదికి ఏమాత్రం తీసిపోని విధంగా సద్దాం తన పంచ్ లతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాడు. హైపర్ ఆది పంచులు , బాడీ షేవింగ్ , డబుల్ మీనింగ్ మీద ఉంటాయని కొంతమంది నెటిజన్స్ అభిప్రాయం.. అయితే కామెడీ పరంగా మాత్రం ఆయన మంచి అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ లో సద్దాం తీసుకొస్తున్నట్లు సమాచారం.. అయితే టీం లీడర్ గా తీసుకొస్తారా? లేక ఒక కంటెంట్ గా తీసుకొస్తారా ? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ జబర్దస్త్ కి సద్దాం వచ్చాడంటే ఇక ఈ కార్యక్రమానికి టిఆర్పి రేటింగ్ పెరిగినట్టే.

Read more RELATED
Recommended to you

Latest news