నాగార్జునకు డబ్బింగ్ చెప్పిన స్టార్ హీరో ఎవరంటే..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా ప్రతి ఇండస్ట్రీలో కూడా తమ అభిమాన నటుల గురించి తెలుసుకోవడానికి ప్రతి అభిమాని కూడా ఎంతో ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోలకు ఒక్కొక్కసారి ఇతరులు కూడా డబ్బింగ్ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వారి సినిమాలు వేరే భాషలో రిలీజ్ చేయాలనుకున్నప్పుడు అందుకు తగ్గట్టుగా హీరోలకు డబ్బింగ్ చెప్పాల్సి రావడం జరుగుతుంది .అలా స్టార్ హీరో సినిమా తీసుకొని నిర్మాతలు ఆ స్టార్ హీరో కి కరెక్ట్ గా సెట్ అయ్యే వాయిస్ కోసం ఎంతో అన్వేషణ చేస్తారు.

ఈ క్రమంలోనే నాగర్జున సినిమాలు ఎక్కువగా కోలీవుడ్లో డబ్ చేయాల్సి వస్తే.. ఎక్కువగా నాగార్జున వాయిస్ కు సీనియర్ స్టార్ హీరో సురేష్ డబ్బింగ్ చెబుతారట. ఈ విషయాన్ని సురేష్ స్వయంగా ఒక షోలో చెప్పారు. తమిళంలో నాగార్జున సినిమాలు డబ్ చేసినప్పుడు నాగార్జునకు వాయిస్ చెప్పడానికి ప్రతి ఒక్కరికి నేనే గుర్తుకు వస్తానని సురేష్ తెలిపాడు. అయితే కేవలం డబ్బింగ్ మాత్రమే కాదు ఇప్పటికీ నాగార్జున యాడ్స్ ను తమిళంలో డబ్ చేయాలి అంటే నిర్మాతలు తననే సంప్రదిస్తారు అని సురేష్ చెప్పుకొచ్చారు.

ఒక రకంగా చూసుకున్నట్లయితే హీరో నాగార్జునకు ఇప్పటికి తమిళంలో తానే డబ్బింగ్ చెబుతానని చెప్పకనే చెప్పేసాడు హీరో సురేష్.. ఏది ఏమైనా ఈ విషయం తెలిసి అటు సురేష్ అభిమానులు ఇటు నాగార్జున అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news