Telugu states : ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

-

తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్​ను విడుదల చేశారు. ఈనెల 16న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మార్చి 13న ఎన్నికల పోలింగ్ నిర్వహించనుండగా.. 16న ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు.

మరోవైపు రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైంది. హైద‌రాబాద్ – రంగారెడ్డి – మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ టీచ‌ర్ ఎమ్మెల్స‌ స్థానానికి ఎన్నిక‌ల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఇవాళ విడుద‌ల చేసింది. ఈ ఎన్నిక‌కు సంబంధించి ఈ నెల 16వ తేదీ నోట‌ఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 23వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల‌కు అవ‌కాశం క‌ల్పించారు. మార్చి 13న ఎన్నిక‌ల పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. 16న ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు. ఇప్ప‌టికే ఆయా ఉపాధ్యాయ సంఘాల అభ్య‌ర్థులు ప్ర‌చారంలో మునిగి తేలుతున్నారు.

మరోవైపు ఏపీలో 13 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇందులో మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ, 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ప్రకాశం- నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల స్థానంతోపాటు… కడప-అనంతపురం-కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గం, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ పట్టభద్రుల స్థానం ఉన్నాయి.

అలాగే ప్రకాశం- నెల్లూరు-చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయ స్థానం, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గం ఉన్నాయి. ఇక అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. వీటికి సంబంధించి ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుండగా… మార్చి 13న పోలింగ్ నిర్వహించి, 16వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు

Read more RELATED
Recommended to you

Latest news