ఇండియాకి కెప్టెన్ ఎవరవుతారు..!

-

ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అక్కడ 3 వన్డేలు నాలుగు టెస్ట్ సిరీస్ లు ఆడనుంది భారత జట్టు. దీనికోసం కరోనా నిబంధనల ప్రకారం క్వారంటైన్ పూర్తిచేసుకున్న భారత ఆటగాళ్లు ప్రస్తుతం ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నారు. అయితే విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ… ప్రసవం సమయంలో భార్య కు తోడుగా ఉండేందుకు బిసిసిఐకి పితృత్వ సెలవులను దరఖాస్తు చేసుకున్నారు విరాట్ కోహ్లీ. దీనిపై భారత్ క్రికెట్ బోర్డు కూడా సానుకూలంగా స్పందించింది.

అయితే ఆస్ట్రేలియా సిరీస్ లో మొదటి టెస్టు తర్వాత విరాట్ కోహ్లీ మిగతా మూడు టెస్టుల కు అందుబాటులో ఉండడుm దీంతో ఈ మూడు టెస్ట్ లకు భారత జట్టుకు కెప్టెన్సీ ఎవరు వహించబోతున్నారు అన్నది ప్రస్తుతం ఆసక్తి కరం గా మారిపోయింది. కొంతమంది రహానే కెప్టెన్ గా మారబోతున్నాడు అని అంటే మరి కొంతమంది రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించ బోతున్నారు వినిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news