ఏయే వయసుల వారికి ఏయే మ్యూచువల్ ఫండ్లు సరైనవో తెలుసుకోండి..

-

మ్యూచువల్ ఫండ్స్.. ప్రస్తుతం ప్రతీ ఒక్కరికీ ఆసక్తి కలిగిస్తున్న ఫైనాన్షియల్ ప్రోడక్ట్. భారత క్రికెటర్లు ప్రచారానికి వస్తున్నారు కాబట్టి, సామాన్య జనాల్లోకి బాగా వెళ్ళగలిగింది. ఐతే ఎంత ప్రచారం జరుగుతున్నప్పటికీ మ్యూచుఫల్ ఫండ్లు అర్థం కాని వారు చాలా ఉన్నారు. కొందరికీ అర్థం అయినా అది మనకి కావాల్సింది కాదులే అని పట్టించుకోవడం లేదు. మ్యూచువల్ ఫండ్లు అనగానే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి అని చెప్పి, పక్కనకి తప్పుకుంటున్నారు. మరికొంత మందేమో మ్యూచువల్ ఫండ్లు కేవలం డబ్బులున్న వారికే అని అనుకుంటున్నారు. ఐతే మ్యూచువల్ ఫండ్లలో ఎవరెవరు పెట్టుబడి పెట్టవచ్చు, ఏయే వయసుల వారికి ఏయే ఫండ్లు బాగుంటాయో ఇక్కడ చూద్దాం.

ముందుగా, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి వయసు అవసరం లేదు. కాకపోతే, మీ వయసుకి తగిన ఫండ్లని ఎంచుకోవాలి.

మీ వయస్సు ఇరవై ఐదు దాటి ఉద్యోగం చేస్తున్నారని అనుకుందాం. అప్పుడు, నెలవారి మ్యూచుఫల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. నెలవారి పెట్టే పెట్టుబడిని సిప్ అంటారు. దీర్ఘకాలం వేచి ఉంటారు కాబట్టి, సిప్ లలో అది కూడా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్లలో పెడితే మంచి ఫలితాలు వస్తాయి.

మీ వయస్సు నలభై దాటిందంటే, రిస్క్ తీసుకోకూడదు. అలాంటప్పుడు, లార్జ్ క్యాప్ ఫండ్లలో పెడితే బాగుంటుంది. లార్జ్ క్యాప్ ఫండ్లలో రిస్క్ తక్కువగా ఉంటుంది.

ఇంకా, మీ వయస్సు అరవైకి చేరువలో ఉంటే, హైబ్రిడ్ ఫండ్లు బాగా పనిచేస్తాయి. వీటిలో ఈక్విటీ, డెట్ కలిపి ఉంటుంది కాబట్టి రిస్క్ తక్కువ.

మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడులు మార్కెట్ ఒడిదొడుకులకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు స్కీముకి సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గా చదవండి.

Read more RELATED
Recommended to you

Latest news