బిగ్‌బాస్‌3: ఈ వారం ఎలిమినేష‌న్ ఎవ‌రో తేలిపోయిందా… ఇతనే..?

-

తెలుగు బుల్లితెరపై ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోన్న బిగ్‌బాస్ 3 సీజ‌న్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేందుకు ఆప‌సోపాలు ప‌డుతోంది. ఇక గ‌త వారం డ‌బుల్ ఎలిమినేష‌న్ అంటూ ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ రాహుల్‌ను ఎలిమినేట్ చేసి అదంతా ఫేక్ ఎలిమినేష‌న్ అని షాక్ ఇచ్చాడు. ఇక హిమ‌జ గ‌త వారం ఎలిమినేట్ అయ్యింది. ఇక ఈ వారం ఎవ‌రు ? ఎలిమినేట్ అవుతార‌నే దానిపై సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాలుగా ట్రెండ్స్ న‌డుస్తున్నాయి. ఈ ట్రెండ్స్‌ను బ‌ట్టి చూస్తే ఎవ‌రు ? ఎలిమినేట్ అవుతార‌నేది దాదాపుగా తేలిపోయిన‌ట్టే క‌నిపిస్తోంది.

ఈ వారం ఎలిమినేష‌న్లో శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, రవిలు నామినేట్ అయ్యారు. వాస్త‌వంగా చూస్తే వీరు నలుగురు బ‌ల‌ల‌మైన కంటెస్టెంట్లే. అయితే వీరిలో ముందు నుంచి మంచివాడిగా ముద్ర వేసుకుని సేఫ్ గేమ్ ఆడుతూ వ‌స్తోన్న టీవీ న‌టుడు ర‌వి ఎలిమినేష‌న్ అవుతాడ‌ని ఎక్కువ మంది చెపుతున్నారు. ఆలీ రెజా ఉన్న‌ప్పుడు అత‌డితో క‌లిసి చాలా సార్లు ఎస్కేపింగ్ గేమ్ ఆడిన ర‌వి ఇప్పుడు వీక్ అయ్యాడు. మరో పక్క వరుణ్‌ గ్రూపులు మెయిన్‌టెయిన్‌ చేస్తూ సేవ్‌ అవుతూ వచ్చాడు ఇన్నిరోజులు. వరుణ్‌కి రాహుల్‌ ఫాలోవర్స్‌, పునర్నవి ఫాలోవర్స్‌ సపోర్ట్‌ చేస్తూ వచ్చారు ఇప్పటివరకు. మొన్నటి ఎపిసోడ్‌లో వరుణ్‌, రాహుల్‌ గొడవ తరువాత ఇప్పుడు వరుణ్‌ అంత స్ట్రాంగ్‌గా లేడు. రాహుల్‌ సపోర్టర్స్‌ మిగితా కంటెస్టంట్స్‌కి ఓట్‌ చేస్తూ, వరుణ్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు సోషల్‌ మీడియాలో.

మొన్నటి వరకు ఒక లేక్క ఇప్పుడు ఒక లెక్క.. రవి ఎలిమినేట్‌ అవుతాడనున్నా.. ఇక ఈ వారం ఎలిమినేష‌న్లో ఉన్న శ్రీముఖి కెప్టెన్ అవ్వ‌డంతో ఆమె ఎలిమినేష‌న్ నుంచి త‌ప్పుకున్న‌ట్టే. ఇక మిగిలిన బాబా భాస్క‌ర్ కూడా త‌క్క‌వ ఓట్ల‌తో సేఫ్ అవ్వ‌బోతున్నాడు. మిగిలింది ఇద్దరు ఒకరు వరుణ్‌, రవి. వీరిద్దరిలో రవి కొంచెం స్ట్రాంగ్‌ ఎందుకంటే టీవీ సీరియల్స్‌ చూసే ఆడియన్స్‌ రవికి సపోర్ట్‌ చేస్తున్నారు. వరుణ్‌ వీకే మరి.. అప్పుడెప్పుడో ఒక కోవకి చెందిన సినిమాలతో హిట్లు కొట్టినా ఇప్పుడు ఫేడ్‌ అయిపోయాడు, రాహుల్‌తో గొడవవల్ల పూర్తిగా వీకయ్యాడు. వీక్‌ కావడమే కాదు వ్యతిరేకులు ఎక్కువయ్యారు.

ఇక ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది రవి, వరుణ్‌లలో ఒకరు పక్కా.. వరుణ్‌ వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.. మరి బిగ్‌బాస్‌ ఎం చేస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news