ఆ మల్టీస్టారర్ లో పవన్ తో నటించేది ఎవరంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలని లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే మూడు సినిమాలు అనౌన్స్ అయ్యాయి. తాజాగా మరో సినిమా ప్రకటన కూడా వచ్చేసింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సాగర్ చంద్ర దర్శకత్వంలో సినిమా తెరకెక్కబోతుందని, పవర్ స్టార్ పోలీస్ ఆఫీసరుగా కనిపించబోతున్నారని చెప్పారు. వచ్చే ఏడాది ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారట. మళయాలంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం అనే సినిమాకి ఈ చిత్రం రీమేక్ గా తెరకెక్కుతుందని అంటున్నారు. ఇలా అని నిర్మాతలు ప్రకటించనప్పటికీ అందరూ అదే అనుకుంటున్నారు.

ఐతే అయ్యప్పనుమ్ కోషియం సినిమాలో అయ్యప్ప పాత్రలో పవర్ స్టార్ కనిపిస్తే కోషి పాత్రలో ఎవరు కనిపిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. నిజానికి ముందుగా ఈ సినిమాని రీమేక్ చేద్దాం అనుకున్నప్పుడు రానాని కోషి పాత్రలో నటింపజేయాలని అనుకున్నారు. రానా కూడా ఆసక్తిగా ఉన్నాడని అన్నారు. ప్రస్తుతం ఈ పాత్ర విషయమై ఎలాంటి సమాచారం రాలేదు. మరి రానా ఈ పాత్రలో చేస్తాడా లేదా మరో హీరోకి అవకాశం ఇస్తాడా అనేది చూడాలి. కాకపోతే పవర్ స్టార్ పక్కన రానా చేస్తే సినిమా రేంజ్ మరో లెవెల్ కి వెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.