ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌ను వాడుతున్న యూజర్లకు శుభవార్త. ఇకపై ఆ యాప్‌లో మరో అద్భుతమైన ఫీచర్‌ను యూజర్లు ఉపయోగించుకోవచ్చు. ఇప్పటి వరకు ఆ యాప్‌లో ఏదైనా ట్రాన్స్‌లేట్ చేయాలంటే.. రియల్‌టైంలో అది సాధ్యమయ్యేది కాదు. కానీ ఇకపై అందులో ఒక భాషలోని వాక్యాలను మరొక భాషలోకి రియల్‌టైంలో ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు.
గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌లో అందుబాటులోకి వచ్చిన రియల్‌టైం ట్రాన్స్‌లేషన్ (Transcribe) ఫీచర్ సహాయంతో యూజర్లు ఒక భాష నుంచి మరొక భాషలోకి వాక్యాలను రియల్‌టైంలో ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. ఇందుకు గాను యాప్‌లో ఉండే మైక్ బటన్ సహాయపడుతుంది. యూజర్ ఎదురుగా ఎవరైనా విదేశీ బాష మాట్లాడుతుంటే.. దాన్ని అప్పటికప్పుడే తమకు వచ్చిన మరొక భాషలోకి రియల్‌టైంలో ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. దీంతో వారు చెబుతున్నది మనకు సులభంగా అర్థమవుతుంది. మనం మన మాటలను వాళ్లకు సులభంగా చెప్పగలుగుతాం.
అయితే ఈ ఫీచర్ వల్ల ప్రస్తుతం ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, హిందీ, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్, థాయ్ భాషలను మాత్రమే రియల్‌టైంలో ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. త్వరలోనే మరిన్ని భాషలకు గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌లో సపోర్ట్‌ను అందివ్వనున్నారు. ఇక ప్రస్తుతం ఈ ఫీచర్ కేవలం ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్ ను వాడేవారికి మాత్రమే అందుబాటులో ఉండగా, త్వరలోనే ఐఓఎస్ యూజర్లకూ ఈ ఫీచర్‌ను అందివ్వనున్నారు.