కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేయడంతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఆయన నిర్ణయంపై బీజేపీ నేతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. తాజాగా హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. మొన్ననే బీఆర్ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయమని చెప్పిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మాట ఎలా మార్చారని ఆయన ప్రశ్నించారు. పార్టీ మారే ముందు ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని ఈటల అభిప్రాయపడ్డారు. రాజగోపాల్ రెడ్డి రాజకీయాల్లో సీనియర్ నేత అని రాజేందర్ అన్నారు. ఆయన రాజీనామా లేఖను ఇంకా చదవలేదని ఈటల తెలిపారు.
మరోవైపు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. హుజురాబాద్‌లోనే కాదు గజ్వేల్‌లోనూ ఈటల గెలవబోతున్నాడని ధీమా వ్యక్తం చేశారు. ఎవరి బలం ఎంత అనేది ఎన్నికల్లో తేలిపోతుందని.. బీఆర్ఎస్ డబ్బు సంచులను నమ్ముకుందాని రాజేందర్ ఆరోపించారు. హుజురాబాద్ , గజ్వేల్‌లలో తానే గెలుస్తానని.. తాటాకూ చప్పుళ్లకు భయపడేది లేదని రాజేందర్ పేర్కొన్నారు.