ఈ రోజు ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ ఎంచుకుని నెదర్లాండ్ ను ముప్పతిప్పలు పెట్టింది. ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్ లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. ఈ స్కోర్ చూడగానే నెదర్లాండ్ ప్లేయర్స్ భయపడేలా టార్గెట్ సెట్ చేసింది. ఆస్ట్రేలియా ఇనింగ్స్ లో మొదట డేవిడ్ వార్నర్ క్లాసిక్ సెంచరీ సాధించగా, ఆ తర్వాత డేంజరస్ మాక్స్ వెల్ క్రీజులోకి రాగానే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. పడిన బంతిని పడినట్లే బౌండరీలు తరలిస్తూ డచ్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ దశలో మాక్స్ వెల్ వరల్డ్ కప్ హిస్టరీ లోనే అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. మాక్స్ వెల్ కేవలం 40 బంతుల్లోనే 101 పరుగులు చేసి రికార్డును అందుకున్నాడు. ఇతని ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు మరియు 8 సిక్సులు ఉన్నాయి.
ఇతని విద్వంసానికి బౌలర్లకు ఎక్కడ బంతిని వేయాలో కూడా అర్ధం కాలేదంటే ఏ రీతిలో ఇన్నింగ్స్ సాగిందన్నది అర్ధం అవుతోంది. వరల్డ్ కప్ లో ఎవ్వరూ సాధించని ఘనతను సాధించి సింగిల్ మ్యాచ్ లోనూ హీరో అయిపోయాడు మాక్స్ వెల్.