ఫిదా సినిమాతో అందరినీ ఫిదా చేసింది. మారి-2 సినిమాతో మాస్ లెవల్స్ చూపించింది. పడిపడి లేచే మనసుతో అందరి మనసులు కొల్లగొట్టింది. ఆమెనే మన సాయిపల్లవి. ఈమె చేసిన ప్రతి సినిమా దాదాపు హిట్ లేదా ఆవరేజ్ టాక్ ఉన్న సినిమాలే. అందం, అంతకు మించి నటన, డ్యాన్స్ ఇలా ఒక్కటేమిటి ఈమె కు చాలా ట్యాలెంట్లు ఉన్నాయి.
ఇక తెలుగు, తమిళ భాషల్లో ఈ హీరోయిన్‌కు ఎనలేని క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. పెద్దగా అందాలు ఆరబోయకపోయినా ఆమె ఫ్యాన్స్ మాత్రం నేచురల్ బ్యూటీ అంటూ మోస్తున్నారు.
మరి ఇంత ఉన్నా ఆమెకు మాత్రం పెద్దహీరోలు ఎందుకు ఆఫర్లు ఇవ్వట్లేదు. తెలుగులో ఒక్క పెద్ద హీరో కూడా ఛాన్స్ ఇవ్వలేదు ఈమెకు. మొన్న వచ్చిన రష్మిక కూడా స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. కానీ సాయి పల్లవి మాత్రం ఆవరేజ్ హీరోలతోనే సినిమాలు చేస్తోంది. ఇందుకు కారణం ఆమె గ్లామర్‌కు దూరంగా ఉండటమే. పాత్ర ఇంపార్టెన్స్ అనిపిస్తేనే ఓకే చేస్తుంది. లేదంటే వద్దని చెప్తుంది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు, అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాలు కూడా ఇలాగే వద్దని చెప్పిందట. అందుకే ఆమెకుపెద్ద హీరోల సినిమాల్లో ఆఫర్లు తగ్గిపోయాయి.