జపాన్ ట్రాఫిక్ లైట్లలో నీలి రంగు ఎందుకో..?

-

రోడ్డుపైన వెళ్తుంటే మనం గమనించని సంకేతికాలు చాలా ఉంటాయి. కానీ చాలమంది వాటిని పట్టించుకోరూ.. బైక్ ఎక్కి రయ్ మనీ పోయే పనిలో ఉంటారు. ఒక్క సిగ్నల్ దగ్గర మాత్రం ట్రాఫిక్ లైట్ రెడ్ ఉంటే ఆపేస్తాం.. ఆరెంజ్ ఉంటే రెడీగా ఉంటాం.. గ్రీన్ వస్తే బైక్ స్టార్ చేసి దూసుకెళ్తుంటాం. ఇది మాకు తెలిసిందే ఇందులో కొత్తెముంది అనుకుంటున్నారా… ఉందండీ! మన దేశంలో ఇదే పద్ధతి మనం అనుచరిస్తాం.. కానీ జపాన్లో ఏంటో ఆకుపచ్చ రంగుకు బదులు నీలి రంగు ఉంది. దీని వెనుక పెద్ద స్టోరీయే ఉందంట.. అందేంటో తెలుసుకుందామా!

traffic
traffic

కొన్ని సంవత్సరాల క్రితం జపాన్ లో నలుపు, తెలుపు, ఎరుపు, నీలం రంగులు మాత్రమే ఉండేవట. నీలి రంగును ‘అవో’ అని ముద్దుగా పిలుచుకునేవారు. అయితే వాళ్లు నీలి రంగును ఆకుపచ్చ రంగును ఒకటే అని భావించేవారు. పెద్ద తేడా ఏమి ఉండదుగా.. రెండింటిని అవో అనే పిలిచేవారంట. కానీ తర్వాత ఆకుపచ్చ రంగుకు ‘మడోరి’ అనే పేరు పెట్టారు. కానీ జనాలు పాతపేరుకే అలవాటు పడిపోయి.. ఇప్పటికి ఆకుపచ్చ రంగును అవో అనే అంటారు.

1968లో జరిగిన ట్రాఫిక్ వియన్నా సదస్సులో వివిధ దేశాలు అన్ని ఆకుపచ్చ రంగులైట్లే వాడాలని నిర్ణయించాయి. జపాన్ ఈ నిర్ణయాన్ని ఒప్పుకోకుండా సంతకం చేయలేదు. కానీ, ప్రపంచ దేశాలను అనుసరిస్తూ ఆకుపచ్చ రంగును ఉపయోగించేదట. కానీ లోకల్ లో దానిని ఆవోగా పరిగణిస్తుండటంతో పత్రాల్లో అదే రాశారు. దీంతో భాషావేత్తలు మండిపడ్డారు. పేరు మారిస్తే జపనీయులకు కోపం.. రంగు మారిస్తే దేశాలకు కోపం.. దీంతో అప్పటి ప్రభుత్వం ఆకుపచ్చ రంగును పోలిఉండే నీలం రంగును ట్రాఫిక్ లైట్లలో వాడాలని నిర్ణయించింది. ఆకుపచ్చ రంగులా ఉండే సముద్రనీలం రంగును ఎంపిక చేసింది. ఇక అప్పటి నుంచి ఎరుపు, పసుపు, అక్వా బ్లూ రంగు లైట్లను ట్రాఫిక్ లైట్లకు వాడేస్తున్నారు. ఇదీ అన్నమాట సంగతి.. అందుకే వాళ్లు ఆ రంగు నీలంను వాడుతున్నారు. ఇప్పటికీ అక్కడ పచ్చరంగును అవోగా పిలుస్తున్నారట.. ఉదాహరణకు ఆకుపచ్చ ఆపిల్స్ ను వాళ్లు అవో ఆపిల్స్ అనే అంటారు.

Read more RELATED
Recommended to you

Latest news