ఆన్‌లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్ష‌న్ ఫ్రాడ్ జ‌రిగితే నష్టం ఎవ‌రు భ‌రిస్తారు ?

-

ప్ర‌స్తుతం ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. ప్ర‌జ‌లు ఎంత అప్ర‌మ‌త్తంగా ఉంటున్న‌ప్ప‌టికీ కొంద‌రు వినూత్న‌మైన ప‌ద్ధ‌తుల్లో మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. దీంతో జ‌నాలు పెద్ద ఎత్తున డ‌బ్బు న‌ష్టపోతున్నారు. అయితే ఆన్‌లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్ష‌న్ల‌లో మోసం జ‌రిగితే ఆ న‌ష్టాన్ని నిజానికి ఎవ‌రు భ‌రించాలి ? క‌స్ట‌మ‌రా ? బ్యాంకా ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

whose liability exists if banking online frauds happen

ఆర్‌బీఐ తెలిపిన వివ‌రాల ప్రకారం.. ఒక క‌స్ట‌మ‌ర్ త‌న బ్యాంక్ అకౌంట్‌లో ఫ్రాడ్ జ‌రిగాక 3 వ‌ర్కింగ్ డేస్ లోగా బ్యాంకుకు ఆ విష‌యం తెలియ‌జేయాలి. ఆ స‌మ‌యం దాటితే క‌స్ట‌మ‌ర్ బ్యాంకుకు ఫిర్యాదు చేసినా లాభం ఉండ‌దు. అప్పుడు న‌ష్టం మొత్తాన్ని క‌స్ట‌మ‌రే భ‌రించాల్సి ఉంటుంది.

ఇక క‌స్ట‌మ‌ర్ నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఫ్రాడ్ జ‌రిగితే అలాంటి న‌ష్టాల‌కు బ్యాంకులు ప‌రిహారం చెల్లించ‌వు. అంటే.. ఎవ‌రైనా ఫోన్ చేసి బ్యాంక్ అకౌంట్ యూజ‌ర్‌నేమ్‌, పాస్‌వ‌ర్డ్ లేదా క్రెడిట్, డెబిట్ కార్డుల వివ‌రాలు, యూపీఐ పిన్‌, పాస్‌వ‌ర్డ్‌, ఓటీపీ త‌దిత‌ర వివ‌రాల‌ను అడిగితే చెప్పార‌నుకోండి.. అలాంటి సంద‌ర్భాల్లో క‌స్ట‌మ‌ర్ నిర్ల‌క్ష్య‌మే కార‌ణం క‌నుక అలాంటి ఫ్రాడ్‌ల‌కు బ్యాంకులు న‌ష్ట‌ప‌రిహారాన్ని చెల్లించ‌వు.

అయితే క‌స్ట‌మ‌ర్ నిర్ల‌క్ష్యం ఉన్నా, లేక‌పోయినా కొన్ని బ్యాంకులు మాత్రం నిర్ణీత స‌మ‌యంలోగా ఫిర్యాదు చేస్తే క‌స్ట‌మ‌ర్‌కు కోల్పోయిన మొత్తాన్ని చెల్లిస్తాయి. ఇక దీంతో సంబంధం లేకుండా క‌స్ట‌మ‌ర్లు ఆన్ లైన్ మోసాల నుంచి ర‌క్ష‌ణ కోసం ఇన్సూరెన్స్‌ను కూడా తీసుకోవ‌చ్చు. అలాంటి సంద‌ర్భాల్లో క‌స్ట‌మ‌ర్లు ఫ్రాడ్ జ‌రిగిన వెంట‌నే సద‌రు ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ చేసి విష‌యం తెల‌పాలి. వారు విచార‌ణ చేసి నిజంగా ఫ్రాడ్ జ‌రిగిందా, లేదా అన్న వివ‌రాల‌ను తెలుసుకుని అప్పుడు ఇన్సూర్ చేసిన మొత్తాన్ని చెల్లిస్తారు.

ఇక క‌స్ట‌మ‌ర్‌కు న‌ష్ట ప‌రిహారం చెల్లించేందుకు లేదా మోసపోయిన మొత్తాన్ని తిరిగి అకౌంట్‌లో జ‌మ చేసేందుకు 10 రోజుల క‌న్నా ఎక్కువ స‌మ‌యం తీసుకోరాదు. 10 వ‌ర్కింగ్ డేస్ లోగా ఆ మొత్తాన్ని క‌స్ట‌మ‌ర్‌కు చెల్లించాలి. అలాగే ఆన్‌లైన్ ఫ్రాడ్ జ‌రిగింద‌ని క‌స్ట‌మ‌ర్ ఫిర్యాదు చేశాక‌.. తిరిగి ఏదైనా ఫ్రాడ్ జ‌రిగితే అప్పుడు అందుకు పూర్తిగా బ్యాంకే బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news