కేసులు ఎందుకు పెరుగుతున్నాయో చెప్పండి…?

-

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. 4 రోజుల వ్యవధిలో దాదాపు 10 వేల కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే మరణాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వాలు ప్రజలకు నిజాలు చెప్పాలి అని కొందరు డిమాండ్ చేస్తున్నారు. లాక్ డౌన్ ఉంది… లాక్ డౌన్ ఉన్న సమయంలో కేసులు ఎందుకు పెరుగుతున్నాయి…? అసలు ఏ విధంగా పాకుతుంది…?

ప్రజలు ఎవరూ బయటకు రావడం లేదు… బయటకు వచ్చినా దాదాపుగా సామాజిక దూరం పాటిస్తున్నారు. సామాజిక దూరం పాటించని వారిని దాదాపుగా క్వారంటైన్ చేస్తున్నారు అధికారులు. విదేశాలు, మర్కాజ్ యాత్రికులు అయిపోయింది. ఇప్పుడు పది వేల కేసులు 4 రోజుల్లో ఏ విధంగా నమోదు అవుతున్నాయి…? లాక్ డౌన్ లేని దేశాల్లో పెరిగినట్టే పెరుగుతున్నాయి కేసులు. నిన్న ఇటలీ కంటే ఎక్కువ కేసులు మన దేశంలోనే నమోదు అయ్యాయి.

అంటే ఇది గ్రామ స్థాయిలోకి వెళ్ళిందా…? గ్రామ స్థాయిలోకి వెళ్తే ఏ విధంగా ఉంది…? ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గ్రామ స్థాయికి దాదాపుగా వెళ్ళింది. రాజస్థాన్ లో కూడా దాదాపుగా చిన్న చిన్న పట్టణాలకు కరోనా సోకింది. లాక్ డౌన్ అమలులో ఉన్నా 40 రోజుల్లో కేసులు సగటున 1200 చొప్పున నమోదు అవుతున్నాయి. ఎవరికి కరోనా వచ్చిందో ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. లాక్ డౌన్ ని అమలు చేస్తున్నా ఎందుకు కేసులు పెరుగుతున్నాయో కూడా చెప్పాలి. చెప్పకపోతే ఎన్నేళ్ళు లాక్ డౌన్ విధించినా సరే ఉపయోగం మాత్రం ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news