ఈటీవి’ భారతీయ టెలివిజన్ చరిత్రలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. చాలా చానల్స్ కి ఈ ఛానల్ ఒక మంచి లైబ్రరి. ప్రజలకు ఎలా దగ్గరవ్వాలి… వాళ్ళు ఎం కోరుకుంటున్నారు…? వాళ్ళ ఆలోచనకు దగ్గరవ్వాలి అంటే ఎం చెయ్యాలి…? అనేది బహుశా ఈ ఛానల్ కి తెలిసిన స్థాయిలో మరో ఛానల్ కి తెలియదు ఏమో. అందుకే దేశంలో ఇప్పటికి ఈటీవికి ఆదరణ ఉంటుంది అనేది అందరికి తెలిసిన విషయం.
ఈ ఛానల్ లో వచ్చే కార్యక్రమాలకు మంచి ఆదరణ ఉంటుంది. ప్రతీ కార్యక్రమానికి ఒక క్రేజ్ అనేది ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటుగా మాస్ ఆడియన్స్ కి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ ఛానల్ తీరు మారుతుంది. ఏ వార్తకు అయినా ఏ కార్యక్రమానికి అయినా సరే ఈటీవి చూడాలి అనుకునే ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పుడు ఈ ఛానల్ పై తమ అభిప్రాయం మార్చుకుంటున్నారు.
దానికి కారణం జబర్దస్త్, డీ వంటి డాన్స్ షోలే. ఈ రెండు షోలలో పాల్గొనే వారు కొందరు ప్రవర్తిస్తున్న తీరు ఛానల్ ప్రతిష్టతను దిగజారుస్తుంది. చిన్న పిల్లలను, ఆడవాళ్ళను ఉద్దేశించి మాట్లాడే డబుల్ మీనింగ్ మాటలు, వాళ్ళ ప్రవర్తన డాన్స్ షో లో పిల్లలు వేసుకునే బట్టలు, వాళ్ళ ప్రవర్తన, నోటి మాట ఇవన్ని కూడా అసభ్యంగానే ఉంటున్నాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం.
ఇవి మాస్ ఆడియన్స్ మినహా క్లాస్ ఆడియన్స్ చూడలేకపోతున్నారు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ రెండు కార్యక్రమాలు కూడా విమర్శలకు వేదికగా మారుతున్నాయి. తమ రేటింగ్ ల కోసం ఆ కార్యక్రమాలను నిర్మిస్తున్న వాళ్ళు మరింత దిగజారిపోతున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. జబర్దస్త్ లో అయితే కొందరు నటులు చేసే వ్యాఖ్యలు రోత పుడుతున్నాయని అంటున్నారు.
సోషల్ మీడియా వేదికగా వీటిపై అనేక విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఛానల్ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పలువురు. రామోజీ రావు గారు దీనికి అడ్డుకట్ట వేస్తున్నారు. ఈటీవీ అనగానే ఒక ప్రతిష్ట ఉందని, నిత్యం లక్షలాది మంది ఆ ఛానల్ ని చూస్తారని, అలాంటి ఛానల్ ఇలాంటి వాటిని ప్రోత్సహించడం భావ్యం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు పలువురు. మీడియా మొఘల్ గా రామోజీ రావు గారికి పేరుందని, ఆయన దీనికి అడ్డుకట్ట వెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నారు.