గృహప్రవేశం చేసినప్పుడు కచ్చితంగా ఇంట్లోకి గోవు ని తీసుకువస్తూ ఉంటారు కష్టపడి ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసుకునేటప్పుడు మొదట ఆవుని ఇంట్లోకి తీసుకువస్తూ ఉంటారు. గృహప్రవేశం చేస్తారు. ఇల్లంతా కూడా గోవుని తీసుకువచ్చి తిప్పుతూ ఉంటారు ఆ తర్వాత ఇంటి యజమాని కుటుంబ సభ్యులు లోపలికి వెళ్తారు. చాలా కాలం నుండి పాటిస్తున్న ఆచారం ఇది. అందంగా సొంత ఇంటిని కట్టుకుని ఇంటి గృహప్రవేశానికి బంధుమిత్రులని ఆహ్వానిస్తారు.
అలానే మొదట గోవు ని తీసుకువస్తూ ఉంటారు దాని వెనుక కారణం ఏంటి శాస్త్రం ఏం అంటోంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.. కొత్త ఇంట్లోకి గోవును ప్రవేశపెట్టడాన్ని శుభసూచకంగా భావిస్తారు నూతన గృహంలో గోవు మూత్రం గోవు పేడ వేస్తే అంతా మంచి జరుగుతుందని భావిస్తారు. లక్షలు ఖర్చుపెట్టి ఇంటిని కట్టి ఆవుని తీసుకురాకపోతే అదేదో అసంతృప్తి కలుగుతుంది.
అవును తీసుకొస్తే సమాస్తదేవతలు వస్తారని అందుకు తీసుకు రావాలి. కాబట్టి ఖచ్చితంగా మనం కొత్త ఇల్లును కట్టిన తర్వాత గృహప్రవేశం సమయంలో ఆవుని తీసుకురావాలి ఈ రోజుల్లో చాలామంది అపార్ట్మెంట్లలో ఉంటున్నారు ఆవును తీసుకురావడం కుదరడం లేదు. అలాంటప్పుడు ఆ భవన ప్రాంగణంలో ఆవు, దూడలను అలంకరించి పూజించాలి ఆవు పేడ మూత్రాన్ని తీసుకువచ్చి నివాస స్థలంలో చిలకరించాలి ఇలా చేస్తే కూడా గోవును తీసుకువచ్చిన ఫలితం కనబడుతుంది.