గుడ్డు తినటం ఆరోగ్యానికి మంచిది. ఇమ్యునిటీ పవర్ బాగా పెరుగుతుంది. అసలే ఈ కరోనా రోజుల్లో రోజుకు కనీసం ఒక గుడ్డైనా తినమని వైద్యులు చెబుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే గుడ్డు గురించి ప్రయోజనాలు చాలా ఉన్నాయు. జుట్టుపెరగటం నుంచి చాలా ప్రయోజనాలు గుడ్డులో ఉంటాయి. ఇప్పుడు కరోనా వల్ల రోజుకో గుడ్డు తినటం చాలామందికి అలవాటుగా మారిపోయింది.
అలాఅని రోజు షాప్ కి వెళ్లి ఒక్కో గుడ్డు కొనుక్కొని ఎవరూ తినరు. వారానికో, నెలకో సరిపడా గుడ్లను తెచ్చుకుంటారు. వాటిని ఇంట్లో పెట్టుకుని అవసరం వచ్చినప్పుడంతా వాడుకుంటాం. ఇక్కడివరకూ బానే ఉంది. కానీ చాలామంది గుడ్లను ఫ్రిజ్ లో పెడతారు. ఫ్రిజ్ లో కూడా డోర్ పక్కన..ఎందుకంటే అక్కడే గుడ్లు పెట్టడానికి స్పెషల్ గా ఒక ట్రే ఉంటుంది కాబట్టి. కానీ ఆ ప్రాంతలో గుడ్లను పెట్టటం మంచిది కాదని నిపుణులు అంటున్నారు.
డోర్ పక్కన ట్రేలో గుడ్లు పెడితే త్వరగా పాడయ్యే అవకాశం ఉందట. ఎందుకంటే అక్కడ ఉష్ణోగ్రత ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. హెచ్చుతగ్గులు ఉంటాయి. కాబట్టి గుడ్లు పాడవుతాయట. ఫ్రిజ్ లో ఎక్కువ రోజులు స్టోర్ చేసిన గుడ్లను తినకపోవడమే ఉత్తమం అని నిపుణులు అంటున్నారు. ఆరోగ్యం కోసం తిని అనవసరంగా అనారోగ్య పాలవటం ఎందుకు.
మరి గుడ్లను ఎక్కడ పెట్టాలి.?
గుడ్లను ఎయిర్ టైట్ కంటెయినర్‌లో ఉంచి మూతపెట్టాలి. ఆ కంటెయినర్‌ను ఫ్రిజ్‌లో ఉంచి స్టోర్ చేసుకోవాలి. అప్పుడే గుడ్లకు సరైన రీతిలో చల్లదనం అందుతుంది. అలా ఉంటేనే గుడ్లు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి. అప్పుడు తిన్నా ఎలాంటి సమస్యలు రావు.
అంతేకాదు..గుడ్డుతో చేసిన కూరను ఫ్రిజ్ లో కూడా రెండుమూడు రోజులకు మించి ఎక్కువ రోజులు ఉంచకూడదు. అసులు గుడ్డు కూరఅనే కాదు..ఏ కూరని అయినా ఫ్రిజ్ లో ఎక్కువ రోజులు పెట్టడం మంచిదికాదు. మన ఇళ్లల్లో అమ్మలు మిగిలిన కూరలన్ని ఫ్రిజ్ లో పెట్టేసి.దాన్ని ఒక కర్రీపాయింట్ లా మార్చేస్తారు. ఏవేవో కూరలుంటాయి..కానీ అన్నీ ఎప్పటివో. అన్నింటికంటే ముఖ్యం గుడ్ల కూరను ఫ్రిజ్ లో పెట్టి తినకపోవటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఇదండి..ఈసారి గుడ్లను ఫ్రిజ్ లో పెట్టేప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి. అప్పుడు మీ గుడ్లు పాడవకుండా ఉంటాయి. రెండు మూడు రోజుల్లో తీసేస్తాం అనుకుంటే డోర్ పక్కన ఫ్రిజ్ లో పెట్టవచ్చు. ఏం కాదు..ఎక్కువ కాలం మాత్రం స్టోర్ చేయకుడదట.