నిమ్మగడ్డని చివర్లో గవర్నర్ కూడా అవమానించారా

-

ఏపీ ఎస్ఈసీగా పనిచేసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం ముగిసిన రోజు జరిగిన పరిణామాలపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.పదవిలో ఉన్నన్నాళ్లూ ఓ వెలుగు వెలిగిన నిమ్మగడ్డ పదవి నుంచి దిగిపోయే రోజు అదే రేంజ్‌లో ఉంటుందని ఆశించారు. కానీ చివరి రోజు సీన్ రివర్స్ అవ్వడం..గవర్నర్ సైతం జలక్ ఇవ్వడంతో మళ్లీ చర్చకు కేంద్ర బిందువయ్యారు నిమ్మగడ్డ.

పదవీకాలం ముగిసి ఇంటి కెళ్లిపోయిన మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ గురించి అధికార వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. చాలామంది ఉద్యోగులు, ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు
నిమ్మగడ్డ నిష్క్రమణతో ఊపిరి పిల్చుకుంటున్నారట. ఆయన ఉన్నన్నాళ్లూ విధి నిర్వహణ కత్తి మీద సాములా ఉండేదన్నది వారి భావన. దాదాపు ఏదో ఒక అంశంలో ప్రభుత్వంతోనో.. ప్రభుత్వ పెద్దలతోనో వివాదం ఉంటూనే ఉండేది. ఈ క్రమంలో ఆయన నిష్క్రమణ చాలా మందికి ఊరట కలిగిస్తోందనే చర్చ జరుగుతోంది.

సహజంగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ముగిసే సమయంలోగవర్నర్‌ను కలిసి ఎస్ఈసీలు మాట్లాడటమనేది ఆనవాయితీ. దీనికి అనుగుణంగానే నిమ్మగడ్డ గతంలో వ్యవహరించారు. నిమ్మగడ్డ పదవీ విరమణ చేస్తున్న సందర్భంలో అపాయింట్‌మెంట్‌ కోరితే గవర్నర్‌ ఇవ్వకపోవడమే ఆసక్తిగా మారింది. గవర్నర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నందున ఎవ్వరిని కలవడం లేదని.. అపాయింట్‌మెంట్లు లేవని రాజ్‌ భవన్‌ వర్గాలు సమాచారం అందించాయి. ఈ విషయాన్ని స్వయంగా నిమ్మగడ్డే చెప్పారు.

ఇదే అంశం పరిపాలనా వర్గాల్లో చర్చగా మారింది. గవర్నర్‌కు రాసిన లేఖలు..బయటకు లీక్‌ చేస్తున్నారని దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నిమ్మగడ్డ. ఇందులో ప్రతివాదులుగా గవర్నర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీని చేర్చారు. దానిని దృష్టిలో పెట్టుకునే చివరి రోజు రాజ్‌భవన్‌ అపాయింట్‌మెంట్‌ దక్కలేదన్నది ఉద్యోగవర్గాల్లో జరుగుతున్న చర్చ. గవర్నర్‌ కార్యాలయంపై..ఆయన దగ్గర పని చేసే అధికారుల మీద కేసులు వేస్తే అది పరోక్షంగా గవర్నర్‌ మీద వేసినట్టేననే భావన కలుగుతోందనేది రాజ్‌ భవన్ వర్గాల్లో చర్చ నడుస్తుంది.

వ్యాక్సిన్‌ వేసుకున్న కారణంతో గవర్నర్‌ అపాయింట్మెంట్‌ ఇవ్వలేదని చెప్పినా.. ఆ మర్నాడే కొత్త ఎస్‌ఈసీ నీలం సాహ్నీకి గవర్నర్‌ అప్పాయింట్మెంట్‌ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. చివరి రోజు కూడా మంత్రులకు టార్గెట్ గా మారిన నిమ్మగడ్డ స్థాయు దారుణ నిష్క్రమణ గతంలో ఏ ఎస్ఈసీకి ఎదురుకాలేదన్న చర్చ నడుస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news