దోమలు కుట్టడానికి “ఓ రీజన్” ఉందట…!!!

-

వర్షాకాలం వచ్చిందంటే అందరూ భయపడేది రోజువారి కురిసే వర్షపు చినుకులని చూసి కాదు. వర్షం పడిన క్రమంలో స్వైర్య విహారం చేసే దోమల దాడులు చూసి భయపడుతారు. మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలకి కారం దోమలే. పరిసరాలు శుభ్రంగా లేకపోయినా, డ్రైనేజీ వ్యవస్థ బాగోక పోయినా సరే దోమలు తమ ప్రతాపాన్న్ చూపడానికి సిద్దంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనిచారో లేదో కానీ. దోమలు మనల్ని కుడుతాయి, పక్కనే ఉన్న మరో వ్యక్తిని కుడుతాయి కాని కొంతమంది వ్యక్తుల జోలికి వెళ్ళవు.

 

ఎన్ని దోమలు ఉన్నా సరే కొంతమందిని మచ్చుకకి కూడా కుట్టవు అందుకు కారణం కూడా లేకపోలేదట. అసలు దోమలు కుట్టకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయట. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. దోమలకి సహజంగా పగలు పూట కళ్ళు కనపడవు. కానీ సాయంత్రం అవుతున్న కొద్దీ కళ్ళు మెల్లగా కనిపించడం మొదలు పెడుతాయి. చీకటి పడితే మనిషి కళ్ళకంటే కూడా స్పష్టంగా కన్పిస్తాయట.

Image result for mosquito attack humans

అందుకే దోమలు చీకటి పడగానే చెలరేగి పోతాయి. అయితే దోమలు ముఖ్యంగా ముదురు రంగు కి బాగా ఆకర్షించబడుతాయట. ఎవరైతే ముదురు రంగు బట్టలు వేసుకుని కనుపడురో వారిపై వాతి ప్రతాపం చూపిస్తాయట. లైట్ కలర్ డ్రస్సులు వేసుకునే వారి వైపు పెద్దగా దృష్టి పెట్టవని తెలుస్తోంది. అంతేకాదు చెమట వాసాన బాగా వచ్చే వారిపై కూడా దోమలు దాడి చేస్తాయట. అలాగే లావుగా, బరువుగా ఉన్న వారిని కూడా దోమలు టార్గెట్ చేస్తాయట ఎందుకంటే..

 

దోమలు ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని బ్రతుకుతాయి. ఆ వాసన ఎంత దూరంలో ఉన్నా సరే వచ్చేస్తుంది. అయితే లావుగా ఉన్న వాళ్ళు సహజంగా కంటే కూడా అధికంగా కార్బన్ డైఆక్సైడ్ వదులుతారు కాబట్టే అలాంటి వారిని టార్గెట్ చేసుకుంటాయి దోమలు. ఇక తాగుబోతులు పరిస్థితి కూడా ఇంతే. వారి వద్ద అధికంగా చెమట వాసన వస్తుంది కాబట్టి వారిపై కూడా దోమల దాటి అధికంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news