శనిదేవుడి విగ్రహాన్ని ఇంట్లో ఎందుకు పెట్టుకోరు? కారణం ఇదేనా..!

-

హిందువులు అన్ని దేవుళ్లను ఆరాధిస్తారు కానీ.. కొన్ని దేవుళ్ల విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవడానికి వెనకాడతారు. అందులో ముఖ్యంగా బ్రహ్మ, శివలింగం, శనిదేవుడు. అసలు ఎవరి ఇంట్లో అయినా.. నవగ్రహాల విగ్రహాలు చూశారా?
గుడికి వెళ్తేనే నవగ్రహాల దర్శనం చేసుకుని వెనక్కు తిరిగి చూడకుండా వచ్చేస్తారు. శని దేవుడు చాలా పవర్ ఫుల్.. నమ్మి ఆరాధిస్తే.. కష్టాలన్నీ తొలగిపోతాయట. కానీ చాలామందికి శనిదేవుడు అంటే.. భయం ఉంటుంది. ఈరోజు మనం శనిదేవుడి విగ్రహాన్ని ఇంట్లో ఎందుకు పెట్టుకోవద్దో చూద్దాం.
పౌరాణిక విశ్వాసాల ప్రకారం.. శనిదేవుడు ఎవరినైనా చూసిన వారు చెడు స్థితిలో ఉంటారని శాపం ఉంది.. అందుకే శని దృష్టిని నివారించడానికి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించరు.

శనిదేవుడిని ఆరాధించే సమయంలో ఈ విషయాలు గుర్తుంచుకోండి

1. పూజ చేసేటప్పుడు శనివైపు చూడకూడదు.
2. శనికి ఎదురుగా నిలబడి చూడకూడదు. కళ్లలో కళ్లు పెట్టి చూడకూడదు.
3. శని పాదాలను మాత్రమే పూజించాలి.
4. శనివారం హనుమంతుడితోపాటు.. శనిదేవుడి పూజా చేయడం మంచిది.
శనివారం రోజు రావి చెట్టు కింద ఉన్న శని విగ్రాహానికి నూనెను సమర్పించి.., ఆ నూనెను పెద్దలకు దానం ఇవ్వాలి. నూనెను నైవేధ్యంగా సమర్పించేటప్పుడు.. ఎక్కడా పడిపోకుండా చూసుకోండి.. శనివారం చీమలకు నల్ల నువ్వులు.. బెల్లం పెడితే మంచి జరుగుతుందట. శనిదేవుడుని పూజించడంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆ దేవుని అనుగ్రహం కలిగి.. అంతా మంచి జరుగుతుందని పండితుల చెబుతున్నారు.

శనిదేవుడికి నల్లటి వస్తువులే ఎందుకు ఇస్తున్నారు..?

నల్లటి రంగు కారణంగా శనిదేవుడు అవమానానికి గురి కావల్సి వచ్చింది. పూజలలో నలుపు రంగుకి ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. ఈ కారణంగా శనిదేవుడు నలుపును తన ఇష్టమైన రంగుగా చేసుకున్నాడట. అప్పటి నుంచి శని దేవుడికి నలుపు రంగు వస్తువులను సమర్పించడం ప్రారంభమైంది. దీంతో శనిదేవుడు చాలా సంతోషిస్తాడు. ఇది కాకుండా మీరు ఎవరికైనా పేద, నిస్సహాయ లేదా ఆపదలో ఉన్న వ్యక్తికి సాయం చేస్తే శనిదేవుడు ఆశీస్సులు లభిస్తాయట.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news