కేజీవాల్ ను ఎన్నికల ముందు ఎందుకు అరెస్ట్ చేశారు?: సుప్రీం కోర్టు

-

ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన అరెస్టును వ్యతిరేకిస్తూ అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మంగళవారంనాడు విచారణ జరిగింది.

ఈ క్రమంలో సీఎం కేజ్రివాల్ను ఎన్నికల ముందు అరెస్ట్ చేయడంపై ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. లిక్కర్ స్కాం కేసులో తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ ధర్మాసనం విచారించింది. ‘పిటిషనర్ ఎత్తిచూపుతున్నట్లు ఎన్నికల ముందు కేజీవాల్ను ఎందుకు అరెస్ట్ చేశారు? అని ప్రశ్నించింది.కేసులో ఆయన ప్రమేయంపై ఆధారాలు చూపండి’ అని ఆదేశించింది. దీనిపై మే 3న ఈడీ కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

కాగా, ఈ నెల ప్రారంభంలో కేజ్రీవాల్ అరెస్టును ఢిల్లీ హైకోర్టు సమర్ధించింది. దర్యాప్తునకు ఆయన సహకరించనందు వల్లే అరెస్టు చేయడం మినహా ఈడీకి మరో గత్యంతరం లేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version