హైదరాబాద్ లో దారుణం : భర్త ముందే పురుగుల మందు తాగి భార్య సుసైడ్

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో దారుణం చోటు చేసుకుంది. భర్త వేధింపులు తాళలేక.. ఓ మహిళ సుసైడ్‌ చేసుకుంది. భర్త ఎదురుగా ఉండగానే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎం. ఎం. పహాడీ లో శుక్ర వారం చోటు చేసుకుంది.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే…. భర్త వేధింపు భరించలేక రాజేంద్ర నగర్‌ కు చెందిన షభానా బేగమ్ అనే వివాహిత… పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. తను పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంటున్నానని… ఇక నుండి నీవు ప్రశాంతంగా ఉండు అంటూ భర్త తో చెప్పి తన ముందే పురుగుల మందు సేవించింది.

భార్య విషం సేవించిందనే విషయం తెలిసి‌ కూడా భార్యను కాపాడాల్సింది పోయి.. మూర్ఖంగా ప్రవర్తించాడు దుర్మార్గుడు సాజీద్. తన ముందే గిల గిలా కొట్టుకుంటున్నా ఆసుపత్రికి తీసుకొని వెళ్లకుండా పైశాచిక ఆనందాన్ని పొందాడు. చివరకు ఆ అభాగ్యురాలు ప్రాణాలు విడిచింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షభానా మృతి తో తన ఐదుగురు పిల్లలు అనాథలు అయ్యారు. కాగా.. రెండు రోజుల కిందటే… నెల్లూరు జిల్లాలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే.