కొందరికి పిచ్చి పీక్స్ లో ఉంటుంది అనే వ్యాఖ్యలు మనం వింటూనే ఉంటాం. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తు ఉంటారు. ఇప్పుడు లాక్ డౌన్ లో చాలా మంది స్మార్ట్ ఫోన్ కి పరిమితం అయ్యారు. పదే పదే స్మార్ట్ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారు. అష్టా చెమ్మా, పేకాట, లూడో తరహా ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అది అక్కడి వరకు ఆగితే బాగానే ఉంటుంది గాని తనను ఓడిచింది అని భార్యను చితక బాదేసాడు ఒక భర్త.
గుజరాత్‌లోని వడోదరలో ఓ మహిళ ట్యూషన్ టీచర్‌గా పని చేస్తున్నారు. భర్త ఓ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పని చేస్తూ ఉంటారు. లాక్ డౌన్ ఉండటంతో ఇద్దరూ ఇంట్లోనే ఉండిపోయారు. భర్తను ఒప్పించి ఆన్‌లైన్‌లో లూడో గేమ్ ఆడగా… కాలనీలోని మరికొంత మంది కూడా ఆన్‌లైన్‌లో లూడో గేమ్ ఆడుతూ వచ్చారు.
కాని ప్రతీ సారి తన భర్తను ఓడించడంతో… దీంతో కోపం పట్టలేని భర్త ఆమెతో గొడవకు దిగి దాడి చేసాడు. ఆమె వెన్నెముక విరిగిపోయిందని ఆస్పత్రికి తీసుకుని వెళ్ళగా వైద్యులు చెప్పారు. దీనితో ఆగ్రహం వ్యక్తం చేసిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు భర్తను పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వగా… అతను క్షమాపణ చెప్పాడు.