కరోనా టెస్టులు ఎక్కువ చేస్తున్న రాష్ట్రం ఏపీనే; జగన్

-

దేశంలో ఎక్కువ కరోనా టెస్ట్ లు చేస్తున్న రాష్ట్రం ఏపీ అని సిఎం వైఎస్ జగన్ అన్నారు. ఆయన సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దేశం మొత్తం మీద పది లక్షల మందికి 451 మందికి టెస్టులు చేస్తున్నారని, ఏపీలో మాత్రం 1396 టెస్టులు చేస్తున్నామని అన్నారు. 54 మండలాలు ఆరెంజ్ జోన్ లో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు 74 వేలకు పైగా టెస్ట్ లు చేసామని అన్నారు.

ఏపీ లో కరోనా టెస్ట్ ల సామర్ధ్య౦ పెంచామని అన్నారు. రాష్ట్రంలో 9 చోట్ల టెస్టింగ్ కేంద్రాలు ఉన్నాయని అన్నారు ఆయన.కేవలం 63 మండలాలు మాత్రమే రెండ జోన్ లో ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో ఇలాంటి విపత్తులు వస్తే పరీక్షించే సామర్ధ్యం లేదని అన్న జగన్ లాక్ డౌన్ కి సహకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు అని చెప్పారు. గ్రీన్ జోన్ లో 559 మండలాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో 80 శాతం గ్రీన్ జోన్ లో ఉంది అని వివరించారు. ఈ నెలలో టెస్టింగ్ సామర్ధ్యం మరింత పెంచుతున్నామని చెప్పారు.

49 వేల బెడ్స్ లో 25 వేల సింగిల్ ఐసోలేషన్ బెడ్స్ ఏర్పాటు చేసామని చెప్పుకొచ్చారు. ఐదు క్రిటికల్ కేర్ ఆస్పత్రులు ఏర్పాటు చేసామని ప్రతీ ఆస్పత్రిలో ఎన్ 95 మాస్క్ లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు సార్లు సర్వే చేసామని ఆయన వ్యాఖ్యానించారు. సామాన్యులకు కష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు జగన్.

మందులను కూడా డోర్ డెలివరి చేసే పరిస్థితి తీసుకొచ్చామని అన్నారు. వాలంటీర్లకు, ఆశా వర్కర్లకు హ్యాత్సాప్ చెప్పారు జగన్. ప్రజలు వాస్తవ పరిస్థితులు అర్ధం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి హేసారు. ఎంత చేసినా వైరస్ ని కట్టడి చేయలేమని చెప్పిన ఆయన వైరస్ ఎప్పటికి కనుమరుగు అయ్యే అవకాశం ఉండదు అన్నారు జగన్. ప్రతీ పేద ఇంటికి వెయ్యి రూపాయలు అందించామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news