టాప్ లో ట్రెండ్ అవుతున్న వైల్డ్ డాగ్..

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన వైల్డ్ డాగ్ చిత్రం థియేటర్లలో రిలీజైంది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా లేకపోతే ఈ సినిమాకి ప్రేక్షకుల నుంది మంచి స్పందన వచ్చేదే. సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లలో ఎక్కువ రోజులు నిలబడలేకపోయిన ఈ చిత్రం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చింది. ఆల్రెడీ పాజిటివ్ టాక్ వచ్చిన ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో చాలా మంది చూస్తున్నారు. నాలుగు భాషల్లో లభ్యమవుతున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్, ఇండియా లెవెల్లో టాప్ లో ఉంది.

తమిళ వెర్షన్ ఐదవ స్థానంలో ఉంది. ఎన్ ఐ ఏ ఏజెంట్ గా నాగార్జున నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. కథా కథనాలు అన్నీ సరిగ్గా ఉండడంతో ప్రస్తుతం ఓటీటీలో చూడదగ్గ చిత్రంగా నిలుస్తుంది. సోలోమన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకులకూ బాగా నచ్చింది. సో చాలా రోజుల తర్వాత నాగార్జునకి మంచి హిట్ పడిందని చెప్పుకోవచ్చు.