అసలు హుజూరాబాద్‌లో ఏం జరుగుతుందో ఎవరికీ అంతు చిక్కకుండా ఉంది. ఈటల వర్సెస్ టీఆర్ ఎస్ అన్నట్టు రెండు వర్గాలుగా కేడర్ చీలిపోయింది. వీరిద్దరి మధ్యనే ఇప్పటి వరకు రాజకీయాలు నడిచాయి. అయితే ఇప్పుడు మధ్యలోకి బీజేపీ ఎంటర్ అయింది. ఈటల రాజేందర్ ఎప్పుడైతే బీజేపీ కీలక నేతలతో చర్చలు జరిపారో అప్పటి నుంచి ఆయన బీజేపీలో చేరతారని క్లారిటీ వచ్చేసింది.
అయితే ఆయన ఎప్పుడు చేరతారనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. అయితే దీనిపై రఘునందన్ రావు ఒక ఇంటిమేషన్ ఇచ్చారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.
మొన్న రఘునందన్ రావు ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఆ యాంకర్ ఈటల ఎప్పుడు చేరతారంటూ అడిగారు. దీనికి సమాధానంగా రఘునందన్ రావు ఒక క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే ఉంటుందని, జూన్ 2న రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు జరగబోతున్నాయంటూ స్పష్టం చేశారు. అంటే ఇన్‌డైరెక్టుగా ఈటల చేరికపై ఆయన క్లారిటీ ఇచ్చేశారన్నమాట. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ బీజేపీలో చేరనున్నారు ఈటల రాజేందర్?