దక్షిణాఫ్రికా పర్యటనను క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తప్పుబట్టాడు. భారత పర్యటనలో ఆస్ట్రేలియా బోర్డు కూడా అదే చేసి ఉండేదా అని నిలదీశాడు. కరోనా ఆందోళనల కారణంగా గత ఏడాది దక్షిణాఫ్రికా పర్యటన నుంచి ఇంగ్లాండ్ తప్పుకోవదాన్ని కూడా అతను ప్రశ్నించాడు. కాని ఇంగ్లాండ్ జట్టులో ఒక ఆటగాడు కరోనాతో ఉన్నా సరే శ్రీలంక తో టెస్ట్ కి వెళ్ళాడు అని పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా పర్యటనను మంగళవారం వాయిదా వేసిన తరువాత ఆటగాళ్ల భద్రతకు ఆమోదయోగ్యం కాని ప్రమాదం ఉందని ఆరోపించాడు. “ప్రస్తుత సమయంలో ఆస్ట్రేలియా నుండి దక్షిణాఫ్రికాకు ప్రయాణించడం మా ఆటగాళ్ళు, సహాయక సిబ్బంది మరియు మా సమాజానికి ఆమోదయోగ్యం కాదు. ఆరోగ్య మరియు భద్రతా ప్రమాదాలను కలిగిస్తుందని స్పష్టమైంది” అని సిఎ తాత్కాలిక సిఇఒ నిక్ హాక్లే మంగళవారం ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.
“ఈ నిర్ణయం తేలికగా తీసుకోలేదు. మేము చాలా నిరాశకు గురయ్యాము. ముఖ్యంగా ఈ సమయంలో అంతర్జాతీయ క్రికెట్ కొనసాగించడం చాలా అవసరం అని ఆయన అన్నారు. అయినప్పటికీ, మా ప్రజల ఆరోగ్యం మరియు భద్రత ఎల్లప్పుడూ మా ప్రధమ ప్రాధాన్యత అని మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి మేము చాలా జాగ్రత్తగా ఉన్నామని చెప్పారు. ఇటీవల ఇండియా తో ముగిసిన సీరీస్ లో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోయింది.