అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతున్న రైతుల పోరాటం

-

ఢిల్లీలో రైతుల పోరాటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతుంది. రైతుల పోరాటం పై పాప్‌ సింగర్ రిహానా ట్వీట్‌తో ప్రపంచ వ్యాప్తంగా సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. మనమెందుకు దీని గురించి మాట్లాడటం లేదు అంటూ రైతుల ఉద్యమంపై సీఎన్‌ఎన్‌ ప్రచురించిన కథనాన్ని జోడిస్తూ రిహానా చేసిన ట్వీట్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ అయ్యింది. ఇక దీనిపట్ల ట్విట్టర్‌కు నోటీసులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో వివాదం కొత్త మలుపు తీసుకుంది.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటం మరోసారి అంతర్జాతీయంగా హాట్‌ టాపిక్‌ అయ్యింది. రైతు ఉద్యమంపై సీఎన్‌ఎన్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని జోడిస్తూ.. పాప్‌ సింగర్‌ రిహానా చేసిన ట్వీట్‌ కి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ మేన కోడలు మీనా హారీస్, పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రేటా థనబర్గ్‌.. రైతు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. అయితే, రిహానా ట్వీట్‌పై బాలీవుడ్ కంగనా రనౌత్‌ సీరియస్‌ అయ్యింది.

కంగనా కూడా రిహానా బాటలోనే.. ఉద్యమం చేస్తున్నది రైతులు కాదు.. దేశాన్ని విభజించాలనుకుంటున్న ఉగ్రవాదులు అంటూ ట్వీట్ చేసింది. దేశాన్ని ముక్కలుముక్కలుగా చేసి, చైనా కాలనీగా మార్చాలనుకుంటున్నారు. మీలా మా దేశాన్ని అమ్మాలనుకోవడం లేదు. అందుకే ఎవరూ మాట్లాడటం లేదు” అంటూ రిహానా పై విరుచుకుపడింది.

మరోవైపు ఇంటర్నేషనల్‌ సెలెబ్రిటీల ట్వీట్లతో అప్రమత్తమైన విదేశాంగశాఖ, కావాలని కొందరు బాధ్యతా రహితమైన ట్వీట్లు చేస్తున్నారని విమర్శించింది. ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా పోలీసులు సంయమనంతోనే ఉన్నారని తెలిపింది. దేశవ్యతిరేక హ్యాష్‌ ట్యాగ్‌లు ట్రెండ్‌ అవడం పట్ల ..ట్విట్టర్‌పై కేంద్రం ప్రభుత్వ సీరియస్సయ్యింది. తమ ఆదేశాలను పాటిస్తారా..లేక చర్యలు తీసుకోవాలా..అంటూ నోటీసులిచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news