భక్తి: గురువారం విశిష్టత మీకు తెలుసా..?

-

వారంలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంటుంది. గురువారం నాడు ఏం చేస్తే మంచిది…?, ఏ పనులు చేయకూడదు, …? గురువారం నాడు ఏ పని చేయడానికి అనుకూలం..? ఇలా అనేక విషయాలు మీ కోసం. గురువారం నాడు ఏఏ పనులు చేస్తే మంచి కలుగుతుంది అనే విషయానికి వస్తే… గురువారం నాడు గురువులను పూజించడం చేస్తే చాలా మంచి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

అలానే సకల కార్యాలకి శుభ దినం గురువారం అని కూడా పండితులు చెబుతున్నారు. గృహ ప్రవేశం వంటి మొదలైన కార్యక్రమాలకి కూడా గురువారం చాలా మంచి దినం. అలానే సన్మార్గంలో నడవడానికి కూడా గురువారం చాలా విశేషమైన రోజు అని మనం చెప్పుకోవచ్చు. అంతే కాదండి గురువారం నాడు దత్త ఆరాధన చేయడం, దత్త ఉపవాసం చేయడం కూడా చాలా మంచిది అని చెబుతున్నారు పండితులు.

ఎవరైతే దత్తాత్రేయుడి కి పూజ చేస్తారో వాళ్లకి యోగ దాయకమైన రోజు ఇది. అలానే చాలా మంది పిల్లలకు చదివినది గుర్తు ఉండదు. ఇట్టే చదివినది మర్చిపోతారు. అలాంటి పిల్లలు గురువారం నాడు దత్తాత్రేయుడు కి పూజ చేయడం వల్ల చదివినవి గుర్తు ఉంటాయి. అలానే దక్షిణామూర్తి ఆరాధన కనక గురువారం నాడు చేస్తే ఉజ్వల భవిష్యత్తు వాళ్ళ సొంతమవుతుంది. గురువారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని నిందించకూడదు. ముఖ్యంగా గురువులని అసలు నిందించకూడదు అని పండితులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news