‘ఇండియన్ 2’ ఈ తేదీన విడుదల కానుందా !

-

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఇండియన్ 2.ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.భారతీయుడు సీక్వెల్ గా రాబోతున్న ‘ఇండియన్-2’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోందని సినీవర్గాలు తెలిపాయి. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీని ఈ ఏడాది జూన్13, 2024న లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.

ఎస్‌జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్‌,మధుబాల, ర‌కుల్ ప్రీత్ సింగ్,బ్రహ్మానందం, స‌ముద్రఖని, ప్రియా భవాని శంకర్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉద‌య‌నిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.ఇటీవల విడుదలైనటువంటి ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.తెలుగు, తమిళ, కన్నడ ,మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news