పల్నాడు ప్రాంతంలో ఏకగ్రీవాల మోత మోగుతుంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకంగా ఉన్న ఏకగ్రీవాల విషయంలో మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి చాలా స్పీడ్ గా వెళ్తున్నారు. మాచర్ల నియోజకవర్గం 77 గ్రామాలకు గాను 73 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. 73 గ్రామాలను ఏకగ్రీవంగా వైసిపి మద్దతు దారులు గెలుచుకోవడం సంచలనం. మాచర్ల పరిణామాలపై టిడిపి గగ్గోలు పెడుతుంది.
బలవంతపు ఏకగ్రీవాలు అంటూ ఆరోపణలు చేస్తుంది. మాచర్ల నియోజకవర్గం లో కేవలం నాలుగు చోట్ల రెండో వర్గం నామినేషన్లు వేయడం గమనార్హం. రాష్ట్రంలోనే అత్యధిక ఏకగ్రీవాలు అయిన నియోజకవర్గంగా మాచర్ల నిలిచింది. జెడ్ పీ టీ సి, ఎంపీటీసీలు కూడా మాచర్ల నియోజకవర్గం లో మొత్తం వైసిపి కి ఏకగ్రీవం అయ్యాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఒక సిఐ ఈ నియోజకవర్గంలో వివాదంలో చిక్కుకున్నారు.
రెంటచింతల మండలం పాల్వాయి లో వైసిపి రెబల్ అభ్యర్థి గా కోటిరెడ్డి నామినేషన్ వేసారు. పొలం లో పని చేసుకుంటున్న కోటిరెడ్డి ని తీసుకొచ్చి విత్ డ్రా చేసుకోవాలని పోలీసులు చావబాదారు. కోటిరెడ్డి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పిడుగురాళ్ల ఆసుపత్రి కి తరలించారు. కోటిరెడ్డి పై దాడికి నిరసన పోలీసులపై గ్రామస్తులు తిరగబడ్డారు. పోలీసులపై రాళ్ల దాడి కూడా జరిగింది. పాల్వాయి జంక్షన్ లో గ్రామస్తుల రాస్తారోకోకి దిగారు.