సమీరా సెకండ్ ఇన్నింగ్స్ కి సై అంటుందా…!

ప్రేమ.. పెళ్లి.. పిల్లలు. ఆతర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్. సినిమా హీరోయిన్స్‌ లైఫ్‌ షెడ్యూల్‌ దాదాపుగా ఇలాగే వుంటుంది. సమీర రెడ్డి ఇందుకు మినహాయింపేమీ కాదు. ఈమధ్య సోషల్‌ మీడియాలో యమా యాక్టీవ్‌గా వుండడంతో.. సమీరా కెమెరా ముందుకు వచ్చేస్తోందంటూ ప్రచారం జరగుతోంది.

సమీరారెడ్డి తెలుగులో ముచ్చటగా మూడు సినిమాల్లో కనిపించి కనుమరుగైపోయింది. నరసింహుడులో చిరంజీవితో.. జై చిరంజీవాలో మెగాస్టార్‌తో.. కృష్ణం వందే జగద్గురుమ్‌లో ప్రత్యేక గీతంలో మెరిసింది. ఈ అమ్మడు నటించిన తెలుగు మూవీ ఒక్కటీ హిట్‌ కాకపోవడంతో.. ఆతర్వాత ఆఫర్స్‌ దక్కలేదు. హిందీ.. తమిళంలో నటించినా.. ఎక్కడా స్టార్‌ ఇమేజ్‌ దక్కలేదు. కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పడుతున్న టైంలో ప్రేమించిన బిజినెస్‌మేన్‌ అక్షయ్‌ను పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లలకు తల్లి అయింది సమీరా.

సమీరా ఆమధ్య ప్రెగ్నెన్సీ టైంలో ప్రసవానంతరం శరీరాకృతి సమస్యలు.. మహిళలు స్వతంత్రంగా గౌరవంగా జీవించాలంటూ అనేక అంశాలను అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ దూకుడు చూసి.. సమీర నటించడానికి రెడీ అంటూ.. కథనాలు వచ్చేశాయి. ఆర్య, విశాల్‌ కలిసినటిస్తున్న కోలీవుడ్‌ చిత్రంలో సమీరా రెడ్డి నటిస్తోందంటూ వార్తలొస్తున్నాయి. దీనిపై సమీర స్పందిస్తూ.. ఇవన్నీ అవాస్తవాలని కొట్టిపారేసింది. ప్రస్తుతానికి ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారని వివరణ ఇచ్చింది.