హఫీజ్ ఖాన్ ను రాజ్యసభకు పంపిస్తా: సీఎం జగన్

-

మే 13 రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇప్పటికి ఆయ పార్టీలు గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.కర్నూల్ నుంచి హఫీజ్ ఖాన్కు టికెట్ ఇవ్వలేకపోయానని సీఎం జగన్ అన్నారు.

‘కానీ ఆయనను రెండేళ్ల తర్వాత రాజ్యసభకు పంపిస్తా అని హామీ ఇచ్చారు.నా మనసులో కల్మషం లేదు కాబట్టి లక్షల మంది సమక్షంలో ఈ మాట చెబుతున్నా. జగన్కు, చంద్రబాబుకు మధ్య తేడా గమనించండి’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా కర్నూల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న హఫీజ్ ఖాన్ను కాదని ఈసారి ఇంతియాజు వైసీపీ టికెట్ ఇచ్చింది.ఇక కూటమిని ఓడించేందుకు నేను సిద్దంగా ఉన్నా.. మీరంతా సిద్దమేనా అని అడిగారు.జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ప్రతి ఒక్కరు స్టార్ క్యాంపెయినర్ గా మారి .. చంద్రబాబు లాంటి మోసగాళ్లను నమ్మవద్దని అన్నారు.మంచి చేశాం.. మంచిని చూపించి ప్రజల వద్దకు వెళుతున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news