సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ క్రిస్ మస్ కానుకగా డిసెంబరు 25వ తేదీన విడుదలకి సిద్ధం అవుతుంది. 50శాతం సీటింగ్ సామర్థ్యంతో నడవనున్న థియేటర్లలో సోలో బ్రతుకే సో బెటరు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. సినిమా విడుదలకి ఇంకా నెల ఉన్నందున అప్పటి వరకు పూర్తి సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లు నడుపుకోవచ్చనే అనుమతులు ప్రభుత్వం నుండి లభిస్తాయని నమ్ముతున్నారు.
అది జరిగినా జరగకపోయినా సోలో బ్రతుకే సినిమా థియేటర్లలోకి రావడం కన్ఫర్మ్ అని ప్రకటించేసారు. కరోనా కారణంగా మూసుకుపోయిన థియేటర్లలో రిలీజ్ అవనున్న మొదటి చిత్రం సోలోనే అవుతున్నందున అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి వచ్చే రెస్పాన్స్ ని బట్టి సంక్రాంతి సీజన్ ఎలా ఉంటుందనేది అవగాహనకి రానుంది. మరి ప్రేక్షకులు థియేటర్లకి వస్తారా లేదా అనేది తెలియాలంటే సోలో బ్రతుకే రిలీజ్ అయ్యే వరకూ ఆగాల్సిందే.