తిరుమలలో ఈరోజు టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ క్రమంలో పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏట వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారాలు పది రోజుల పాటు తెరిచి వుంచాలని నిర్ణయించామని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలు మేరకు కమిటిని నియమించామన్న ఆయన మఠాధిపతులు,పీఠాధిపతులు అంగీకారం మేరకు కమిటీ పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరిచి వుంచాలని నివేదిక సమర్పించిందని అన్నారు.
ఇక టీటీడీ ఆస్థులు పై శ్వేతపత్రం విడుదల చేసిన అయన మొత్తం ఎన్ని ఆస్తులు ఉన్నాయో వివరించారు. భక్తులకు స్వామివారికి సమర్పించిన ఆస్థులు పై ఈ శ్వేత పత్రం విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 1128 ఆస్తులు ఉన్నాయి…. 8088 ఎకరాల విస్తీర్ణంలో ఆస్తులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆస్థులును ఏ విధంగా వినియోగంలోకి తీసుకురావాలి అనే అంశంపై పరిశీలన కోసం కమిటిని నియమించామని అయన అన్నారు. ఇక శ్రీవారి ఆలయంలో మహాద్వారం బంగారు తలుపులు,ధ్వజస్తంభం పీఠంకు బంగారు తాపడం పెట్టిస్తామని ఆయన అన్నారు. టీటీడీ ఉద్యోగులకు అవగాహన కల్పించి ఈ హెచ్ ఎస్ స్కీం అమలు చేస్తామని అన్నారు.