ఆర్టిస్ట్ ని కూడా అరెస్ట్ చేస్తారా…? అయ్యో పాపం… !

-

ముంబైలో ఒక ప్రమాదకరమైన బిల్డింగ్ మీద విన్యాసాలు చేస్తున్న ఒక యువకుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసారు. భవనం యొక్క 22 వ అంతస్తులో స్టంట్స్ చేస్తున్న ఒక యువకుడి వీడియో పోలీసుల దృష్టికి వచ్చింది. అతని ఫ్రెండ్స్ ఈ వీడియోని రికార్డ్ చేస్తుంటే తలకిందులుగా నిలబడి స్టంట్ చేస్తున్నాడు. ఆ వ్యక్తిని నోమన్ డిసౌజాగా గుర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు.

ఈ వీడియో, పశ్చిమ శివారు కండివాలిలోని భారత్ ఎస్ఆర్ఎ భవనం యొక్క 22 వ అంతస్తున రికార్డ్ చేసారు. అక్కడ అతను ఎనర్జీ డ్రింక్ సిప్ చేస్తున్నట్లు వీడియోలో ఉంటుంది. అతను దాని ప్రక్కన ఉన్న లెడ్జ్‌పైకి దూకాడు. అది కేవలం రెండు అడుగుల వెడల్పు మాత్రమే ఉంది. వీడియో షూట్ చేసి తరువాత దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news