ఈ వారం బిగ్ బాస్ లో ‘నో’ ఎలిమినేషన్‌ ఉంటుందా..!?

-

బుల్లితెరపై టాప్ రెట్టింగ్ తో దూసుకెళ్తున్న షో బిగ్ బాస్. ఈ షో విజయవంతగా మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇక ప్రస్తుతం బిగ్‌బాస్‌ సీజన్‌ 4 విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే షో ప్రారంభం అయ్యి 81 రోజులు పూర్తి అయ్యింది. అయితే ఈ క్రమంలో ఒక్కొక్కరుగా బయటకు వచ్చేయగా.. ఇప్పుడు హౌజ్‌లో అభిజిత్‌, అఖిల్‌, అవినాష్‌, అరియానా, మోనాల్‌, హారిక, సొహైల్‌లు మిగిలారు. వీరిలో ఈ వారం నామినేషన్‌లలో అవినాష్‌, అరియానా, మోనాల్‌, అఖిల్‌లు ఉండగా.. అవినాష్‌కి ఎవిక్షన్ పాస్ లభించింది. దీంతో రెండు వారాల పాటు అతడు ఎలిమినేషన్ నుంచి సేఫ్‌ అయ్యాడు.

nagarjuna
nagarjuna

ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ వారం బిగ్‌బాస్‌ 4లో ఎలిమినేషన్ ఉండదని తెలుస్తోంది. అలాగే ఈ వారం రీఎంట్రీ ఉండనున్నట్లు వార్తలు వచ్చినా.. కరోనా నేపథ్యంలో ఆ ఆలోచనను నిర్వాహకులు మానుకున్నట్లు సమాచారం. ఇక రానున్న రెండు వారాల్లో ఇద్దరు ఎలిమినేట్ అవ్వనుండగా.. ఆ తరువాత డిసెంబర్‌ 20న గ్రాండ్ ఫినాలేను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా టాప్‌ 2లో అభిజిత్‌, సొహైల్‌ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మిగిలిన వారిలో అఖిల్‌, అవినాష్‌, మోనాల్‌లు టాప్‌ 5లో ఉండనున్నట్లు టాక్‌.

ఇక ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన సీజ‌న్ల‌ను ప‌రిశీలిస్తే మొద‌టి సీజ‌న్‌లో విజేత‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ ట్రోఫి అందించారు. ఇక రెండో దాంట్లో వెంక‌టేష్, మూడో సీజ‌న్‌లో చిరంజీవి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక నాల్గో సీజ‌న్‌లో పంతొమ్మిది కంటెస్టెంట్లు పాల్గొన‌గా ప‌ద‌కొండో వారం ముగింపుకు వ‌చ్చేస‌రికి కేవ‌లం ఎనిమిది మంది మాత్ర‌మే మిగిలారు. వీరిలో అభిజిత్‌, సోహైల్‌, హారిక‌, అరియానా, మోనాల్‌, లాస్య నామినేష‌న్‌లో ఉండ‌గా మోనాల్‌, లాస్య డేంజ‌ర్ జోన్‌లో ఉన్నారు. ఆన్‌లైన్ పోల్స్ అన్నీ కూడా మోనాల్ బ్యాగు స‌ర్దుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని జోస్యం చెప్తున్నాయి. అయితే నో ఎలిమినేష‌న్‌, రీ ఎంట్రీ వంటి అద్భుతాలు జ‌రిగితే మాత్రం వీరికి గండం గట్టెక్కిన‌ట్టే.

Read more RELATED
Recommended to you

Latest news