మరో 12 గంటల పాటు వైన్ షాపులు బంద్

-

మద్యం ప్రియులకు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. హైదరాబాద్ లో మరో 12 గంటలు వైన్ షాపులు బంద్ కానున్నాయి అని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మే 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి మద్యం దుకాణాలు బంద్ అయినాయి.పోలింగ్ జరిగే మే 13వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. పోలింగ్ ముగిసిన అనంతరం తిరిగి ఓపెన్ అవుతాయి.

అయితే హైదరాబాద్ లో మాత్రం మరో 12 గంటలు లిక్కర్ షాపులు, బార్లు, హోటల్స్, క్లబ్స్,అన్ని రకాల లిక్కర్ షాపులు బంద్ అని పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. తిరిగి మే 14 తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు ఓపెన్ అవుతాయి అని తెలిపారు.అలాగే ఎన్నికల ఫలితాల రోజు వచ్చే నెల జూన్ 4వ తేదీన కూడా వైన్ షాపులు బంద్ . ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.అక్రమంగా మద్యం నిల్వ చేసి అమ్మితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు .

Read more RELATED
Recommended to you

Latest news