Olympics 2022 : నేటి నుంచి వింట‌ర్ ఒలింపిక్స్

-

వింట‌ర్ ఒలింపిక్స్ చైనా రాజ‌ధాని బిజింగ్ వేదిక‌గా నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. వారం రోజుల పాటు జ‌ర‌గ‌బోయే ఈ మంచు క్రిడ‌ల‌కు దాదాపు 90 దేశాల నుంచి ఆటగాళ్లు పాల్గొంటున్నారు. మొత్తం మూడు వేల కు పైగా అథ్లెట్లు ఈ వింట‌ర్ ఒలింపిక్స్ లో పోటీ ప‌డ‌నున్నారు. భార‌త్ నుంచి ఈ సారి ఒక్క‌రు మాత్ర‌మే వింట‌ర్ ఒలింపిక్స్ లో పాల్గొనున్నాడు. జ‌మ్మ క‌శ్శీర్ కు చెందిన ఆరిఫ్ ఖాన్ అనే అథ్లేట్ స్కీయింగ్ లో పోటీ ప‌డ‌నున్నాడు. 1964 నుంచి భార‌త్ వింట‌ర్ ఒలింపిక్స్ లో పాల్గొంటుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు వింట‌ర్ ఒలింపిక్స్ లో ఒక్క ప‌త‌కం కూడా సాధించ‌లేదు.

అయితే ఈ సారి వింట‌ర్ ఒలింపిక్స్ లో ఆరిఫ్ ఖాన్ ప‌త‌కం సాధించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అభిప్రాయ ప‌డుతున్నారు. కాగ‌ 7 క్రిడల‌ల్లో మొత్తం 109 విభాగాల్లో వింట‌ర్ ఒలింపిక్స్ జ‌ర‌గ‌నుంది. అయితే క‌రోనా వ్యాప్తి కార‌ణంగా విదేశీ వీక్షకుల‌కు మైదానంలోకి అనుమ‌తి లేదు. అలాగే వింట‌ర్ ఒలింపిక్స్ లో పాల్గొనే అథ్లేట్స్ కు అధికారుల‌కు లూప్ సిస్ట‌మ్ అనే బ‌యో బ‌బుల్ ను చైనా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. అలాగే అథ్లేట్స్ కు, అధికారుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు క‌రోనా నిర్దారణ పరీక్షలు కూడా చేయ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news