తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. పలు జిల్లాలు గజగజ వణుకుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతున్నాయి. మొన్నటి వరకు తుఫాను ప్రభావంతో తెలంగాణలో పొడి వాతావరణం నెలకొంది. ఆ సమయంలో చలి ప్రభావం లేదు. అయితే ఇటీవల మళ్లీ చలి పెరుగుతోంది. మరో వైపు ఉత్తర భారతం నుంచి చలిగాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి పూట చలి విపరీతంగా పెరుగతోంది. ఉదయం 11 గంటలు కానిదే చలి తీవ్రత తగ్గడం లేదు. తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాలు గజగజ వణుకుతున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట చలి తీవ్రత పెరగుతుంది. జిల్లాలో భోథ్ మండలంలో సోనాలలో 14.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అర్లీ (టీ)15 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మరోవైపు హైదరాబాద్ లో 20 డిగ్రీలు, రామగుండంలో 22 డిగ్రీలు, హన్మకొండలో 20 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మిగతా జిల్లాల్లో కూడా పరిస్థితి ఇలానే ఉంది.
అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ముఖ్యంగా విశాఖ పట్టణం ఏజెన్సీ ప్రాంతాల్లో అరకు, లంబసింగిలో టెంపరేచర్స్ తక్కువయ్యాయి.